Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెమిడెసివిర్ కొరత ఉంటే...సెలబ్రెటీలు,రాజకీయనాయకులు ఎలా పొందుతున్నారు?
ముంబయి : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఆయా రాష్ట్రాల్లో రెమిడెసివిర్ మందు కొరత ఉన్నది. రెమిడెసివిర్‌ను పొందడం సామాన్యులకు కష్టంగా మారుతున్నది. అయితే, ఈ తరుణంలో రెమిడెసివిర్ లభ్యతపై బాంబే హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఇలాంటి తరుణంలో కొందరు సినిమా ప్రముఖులు, రాజకీయ నాయకులు రెమిడెసివిర్ మందును ఎలా పొందగలుగుతున్నారు? కొరత ఉన్నప్పటికీ సదరు యాంటీ వైరల్ డ్రగ్‌ను ఎలాంటి పంపిణీ చేయగలుగుతున్నారు? అని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. కరోనా వైరస్ పరిస్థితిపై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేయగా హైకోర్టు వెబ్సైట్లో గురువారం సాయంత్రం అప్డేట్ చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపాంకర్ దత్త, న్యాయమూర్తి జీ.ఎస్. కుల్కర్ణి లతో కూడిన బెంచ్ ఈ విచారణను చేపట్టింది. సుప్రీంకోర్టు, అనేక ఇతర హైకోర్టుల గత ఆదేశాలానుసారం రెమ్‌డెసివిర్‌ను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయిస్తుందని బెంచ్ గుర్తు చేసింది.