Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అంతకంతకూ తీవ్రతరమవుతోంది. దీని ప్రభావం వల్ల కేరళలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. లక్షద్వీప్‌ల దగ్గర లో ఉన్న తౌక్టే తుపాను పశ్చిమ, నైరుతి దిశగా పయనిస్తూ ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల రాగల 36గంటల్లో అరేబియా సముద్రం దక్షిణాదిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అది తెలిపింది,.
సహాయక చర్యల నిమిత్తం జాతీయ విపత్తు నిర్వహణా బృందాలను మోహరించారు. గుజరాత్, కేరళ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో 24 బృందాలను రంగ ంలోకి దించామని, మరో 29 బృందాలను సిద్ధం చేశామని ఎన్డి ఆర్ఎఫ్ డిజి ప్రధాన్ తెలిపారు. ఈ ప్రభావం కారణంగా గుజరాత్లో ఈ నెల 17నుంచి ముమ్మరంగా వర్షాలు పడే అవకాశం వుంది. సౌరాష్ట్ర, కచ్ల్లో 18, 19 తేదీల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు.
కేరళలోని ఐదు జిల్లాల్లో రెడ్ అలర్ట్
కేరళలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పూజా, ఎర్నాకుళం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో, రెడ్ అలర్ట్ ప్రకటించారు.