Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ రెడ్డిస్ ప్రకటన
న్యూఢిల్లీ : రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ధరను డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ప్రకటించింది. వ్యాక్సిన్ ఒక్కో డోసు ధరను రూ. 995.40 గా ఖరారు చేశారు. వాస్తవానికి వ్యాక్సిన్ ధర రూ.948 లే. కానీ, జీఎస్టీతో కలుపుకొని ఈ ధర దాదాపు వెయ్యి రూపాయలకు చేరుకుంది. రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఈ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఈ రష్యన్ వ్యాక్సిన్ భారత్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. అయితే, పరిమిత సంఖ్యలోనే స్పుత్నిక్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయనీ, వాటన్నిటిని మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని నిటి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యులు డాక్టర్ వీ.కే పాల్ చెప్పారు. రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ దిగుమతి కొనసాగుతుందని ఆయన చెప్పారు. జులై నెలలో స్థానికంగా స్పుత్నిక్ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందనీ, కనీసం 15.60 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం భారత్లో కోవాక్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లను ఆస్పత్రుల్లో ఇస్తున్నారు.