Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పీక్కుతింటున్న కుక్కలు
బల్లియా (ఉత్తరప్రదేశ్) : గంగా నది ఒడ్డున మృతదేహాలు లభ్యమవుతూనే ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని పలుప్రాంతాల్లో నది ఒడ్డున మృతదేహాలను స్థానికులు గుర్తిస్తున్నారు. బల్లియా నగరంలోని నరహి ప్రాంతంలో ఉజియార్, కుల్హదియా, భరౌలి ఘాట్ల వద్దకు 52 మృతదేహలు కొట్టుకుని వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సగర్పలి గ్రామంలో మృతదేహాలు ఉన్నట్లు గురువారం మధ్యాహ్నం సమాచారం రావడంతో ఫెఫ్నా పోలీస్ స్టేషన్ అధికారి సంజరు త్రిపాఠీ, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) అక్కడకు చేరుకుని మృతదేహాలకు అంత్యక్రియలకు నిర్వహించారు. ఆ తరువాత కూడా రెండు మృతదేహాలను వీధి కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గంగ ఒడ్డున లభ్యమైన మృతదేహాల సంఖ్యను జిల్లా అధికారులు స్పష్టంగా వెల్లడించడం లేదు.మరణించిన వారి గౌరవాన్ని కాపాడండి
కేంద్రం, రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సి నోటీసులు మరణించిన వారి గౌరవాన్ని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) నోటీసులు జారీ చేసింది. గంగా నదిలో కొన్ని రోజుల నుంచి మృతదేహాలు కొట్టుకొస్తున్న వార్తలపై స్పందించిన ఎన్హెచ్ఆర్సి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో పాటు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. వీటిపైన ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను నాలుగు వారాల్లోగా నివేదించాలని ఆదేశించింది. మతదేహాలు కోవిడ్‌కు సంబంధించినవనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుపాలని ఆదేశించింది.