Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లిని కాటికి మోసుకెళ్లిన తనయుడు
ధర్మశాల : అరచేతులతో తనను పెంచి పెద్ద చేసిన తల్లిని తనయుడే తన భుజాన మోసుకుని శ్మశానానికి వెళ్లాడు. కోవిడ్‌తో మరణించిన తల్లి అంత్యక్రియలకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కుమారుడే పిపిఇ కిట్ ధరించి ఆమె మృతదేహాన్ని మోసుకెళ్లిన ఫొటోలు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా రాణితల్ ప్రాంతానికి చెందిన బిర్ సింగ్ తన తల్లి ఈ నెల 12న జ్వరం, శ్వాస ఇబ్బందులుతో బాధపడుతుంటే సదర్పూర్లోని తండ మెడికల్ కాలేజ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ పడకలు ఖాళీగా లేకపోవడంతో మళ్లీ ఇంటికి తీసుకొచ్చానని, చివరికి గురువారం మృతి చెందని సింగ్ తెలిపాడు. బంధువులు, స్థానికులు, అధికారులు ఎవరూ అంత్యక్రియలకు సహాయంగా రాకపోతే ఒంటరిగా శ్మశానానికి తీసుకెళ్లానని చెప్పాడు. తరువాత అధికారులు సహాయం పేరుతో ఒక శానిటైజర్ బాటిల్ పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు.