Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు రోజుల్లో 74 మంది మృతి
- తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
గోవా: గోవాలో కరోనాభయానక పరిస్థి తులు ప్రజలను వణికిస్తు న్నాయి. ముఖ్యంగా, గోవా ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత రోగుల ప్రాణాలను తీసుకుంటు న్నది. ఈ కారణంతో గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్ లో గత నాలుగు రోజుల్లోనే దాదాపు 74మంది కరోనా రోగులు ప్రాణా లు వదిలినట్టు తెలుస్తున్నది. అయితే, గోవా ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ కొరత మరణాలను
తోసిపుచ్చడం గమనార్హం. అంతేకాకుండా, ఆక్సిజన్ కొరత విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఆక్సిజన్ కొరత లేదన్న సీఎం.. సమస్య ఉందన్న ఆరోగ్య మంత్రి ''లాజిస్టికల్ సమస్యలతో'' శుక్రవారం 13 మంది చనిపోయారని గోవా మాజీ ఉపముఖ్యమంత్రి విజరు సర్దేశారు ఆరోపించారు. అలాగే, గురువారం 15 మంది రోగులు, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆక్సిజన్ కొరత ఏ మాత్రమూ లేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించడం గమనార్హం. '' ఆస్పత్రిలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత, కోవిడ్-19 వార్డులకు దాని సరఫరా మధ్య గ్యాప్ ఉన్నది. అది కొంత మంది పేషేంట్ల సమస్యలకు కారణమయ్యిండొచ్చు'' అని ఆయన అన్నారు. అయితే, ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రానే సోమవారమే వెల్లడించారు. అయితే, మంత్రి, సీఎం ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. అంతేకాదు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ.కే గోయెల్ కేంద్రానికి రాసిన లేఖ కూడా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉన్నదన్న అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. మహరాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి మాకు కేటాయించిన 110 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు గానూ.. ఈనెల 1 నుంచి 10 మధ్యలో 66.74 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా అయ్యిందని కేంద్రానికి రాసిన లేఖలో గోయెల్ పేర్కొన్నారు. మాకు (గోవాకు) రోజుకు 22 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఇవ్వాలని కోరడం గమనార్హం.
ప్రతిపక్షాల ఆగ్రహం
అయితే, ఆక్సిజన్ కొరతపై నిజాలను దాస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రాణా లతో చెలగాటం ఆడుతోందని ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఆక్సిజ న్ కొరతే లేనప్పుడు ఆస్పత్రిలో ఆక్సిజన్ సమస్యపై దృష్టిని సారించడానికి ఒక కమిటీని ఏర్పాటుచేయడంలోగల ఆంతర్యమేమిటని గోవా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వ్యాక్సిన్లు అందుబాటులో లేకుంటే.. మేం ఉరేసుకోవాలా?
కేంద్ర మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యలు
దేశంలో వ్యాక్సిన్ కొరతపై విలేకరులు అడిగిన ప్రశ్నలపై కేంద్ర రసాయనాల, ఫెర్టిలైజర్స్ మంత్రి డీ.వీ సదానంద గౌడ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం వ్యాక్సిన్ల ఉత్పత్తిలో వైఫల్యం జరిగితే ప్రభుత్వంలో ఉన్న తాము ఉరేసుకోవాలా? అని ప్రశ్నించారు. '' ఒకవేళ కోర్టు ఇంత మొత్తంలో వ్యాక్సిన్ ఇవ్వాలంటుంది. ఒకవేళ అది ఉత్పత్తి కాలేదు. మమ్మల్ని మేము ఉరితీసుకోవాలా?'' అని సదానంద గౌడ అన్నారు. అయితే, బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి విలేకరులతో ఆయన మాట్లాడిన తీరు సరికాదని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.