Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ మణిపూర్ రాష్ట్ర అధ్యక్షుడి కరోనా మరణంపై సామాజిక మాధ్యమాల్లో రాతల ఫలితం
ఇంఫాల్ : రాష్ట్రమేదైనా దేశవ్యాప్తంగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల గొంతు నొక్కడమే బీజేపీ నైజంగా కనిపిస్తున్నది. వారి స్వేచ్ఛను హరించేలా వ్యవహరిస్తున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత మణిపూర్లోనూ ఇదే ఘటన చోటు చేసుకున్నది. కరోనాతో మణిపూర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సైఖోమ్ టికేంద్ర సింగ్ కొన్ని రోజుల క్రితం మరణించిన విషయం విదితమే. అయితే, బీజేపీ నాయకులు చెప్పినట్టుగా కరోనా విషయంలో ఆవు పేడ, గోమూత్రం వంటివి పని చేయవనీ, సైన్సు మాత్రమే రక్షించగలుగుతుందని జర్నలిస్టు కిషోర్చంద్ర వాంగ్ఖేమ్, సామాజిక కార్యకర్త ఎర్నెండ్రో లీచోంబం లు తమ ఫేస్బుక్ వాల్ పేజీల్లో కామెంట్లు పెట్టారు. అయితే, ఈ విషయంపై బీజేపీ నాయకులు ప్రేమానంద మీటీ, ఉషమ్ దేబన్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఇద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆ ఇద్దరిని వారి ఇండ్ల నుంచి అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ ఇద్దరి అరెస్టును జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఖండించారు.