Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీపై రాహుల్ పరోక్ష విమర్శలు
లక్నో: గంగానది ఒడ్డుకు మరోసారి కోవిడ్ మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని మంగళవారం కొట్టుకు వచ్చిన ప్రాంతం వద్దకే భారీ సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. శనివారం ఉదయం కొన్ని శవాలు కొట్టుకు రావడాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మతులకు అంత్యక్రియలు చేయలేక కొంతమంది శవాలను నదిలో పడేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. శవాల ద్వారా తమ గ్రామాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు.
కాగా, గంగా నది ఒడ్డుకు శవాలు కొట్టుకురావడంపై ప్రధాని మోడీపై రాహుల్ పరోక్ష విమర్శలు గుప్పించారు. గంగ పిలుస్తోందని అన్నవారే....ఇప్పుడు విలపించేలా చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. 1140 కిలో మీటర్ల పొడవైన గంగా నది తీర ప్రాంతంలో ఇప్పటి వరకు 2 వేలకు పైగా శవాలను గుర్తించినట్లు పేర్కొన్న ఓ వార్తా కథానన్ని తన ట్వీట్‌కు జత చేశారు.