Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో మరో కులవివక్ష ఘటన
చెన్నై : విల్లుపుర్ణం తమిళనాడులో దళితులపై మరో కులవివక్ష ఘటన చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా, తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టనందాల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నిర్వహించిన సంగీత కచేరికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి.. క్షమాపణలు చెప్పాలని పెత్తందారులు ముగ్గురు దళితులను పంచాయతీ సభ్యుల ముందు సాష్టాంగ నమస్కారం చేయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గ్రామానికి చెందిన దళిత కాలనీలో మ్యూజిక్ ఫంక్షన్ ఒకటి నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన ఒక మతం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడి మైక్‌లు, స్పీకర్లు, ఇతర పరికరాలను సీజ్ చేశారు. అనంతరం వాటిని తిరిగి ఇచ్చేశారు. అయితే ఫిర్యాదు ఎందుకు ఇచ్చారంటూ కాలనీకి చెందిన కొంత మంది గ్రామంలోని యువతను ప్రశ్నించంతో.. అది వాగ్వివాదానికి దారితీసింది. మొదట తాము ఈ సమస్యను పరిష్కరించినా, పంచాయతీ సభ్యులు దీన్ని తిరిగి తెరపైకి తెచ్చారని పోలీసులు తెలిపారు. సంగీత కచేరీ, అనంతరం జరిగిన పరిణామాలను క్షమాపణలు చెబుతూ పంచాయతీ సభ్యులు ముగ్గురు దళితులను సాష్టాంగ నమస్కారం చేయించారని పేర్కొన్నారు.