Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు తీసుకున్నా లేదా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె. విజరు రాఘవన్ శనివారం ట్వీట్ చేశారు. కోవిడ్ కన్నా పూర్వ పరిస్థితులు వచ్చేంత వరకు ఈ నిబంధనలను కొనసాగించాలని ప్రజలను కోరారు. కేసులు పెరుగుదల సమయంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ జోక్యం చాలా కీలకమని, వ్యక్తిగతంగా, సామూహికంగా వీటికి కట్టుబడి ఉండాలని సూచించారు. ఇటువంటి సూచనలే ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ...నిర్లక్ష్యంగా ఉండవద్దని, మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వైరస్ రోజు రోజుకీ కొత్త రూపం సంతరించుకుంటున్న నేపథ్యంలో అజాగ్రత్త తగదని సూచించారు.