Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు ప్రధాని మోడీ ఆదేశం
- కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వంటి పలు ఆంశాలపై ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. కరోనా పరీక్షలను పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. ఆక్సిజన్ కొరత రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయనీ, అందుకే కొన్ని రాష్ట్రాల్లో వీటిని ఉపయోగించడం లేదంటూ వస్తున్న ఆరోపణలను మోడీ తీవ్రంగా పరిగణించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంటిలేటర్లకు సంబంధించి వ్యవస్థాపక, ఆపరేషన్ ఆడిట్‌ను నిర్వహించాలని ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లౌట్.. ఈ వెంటిలేటర్ల వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిపిందే.
-