Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రఘురామరాజు కేసులో ప్రభుత్వ వైద్యుల నివేదిక
- రమేష్ ఆస్పత్రిలో మళ్లీ పరీక్షలు : హైకోర్టు
విజయవాడ: నర్సాపురం ఎంపి రఘురామరాజు ఎటువంటి గాయాలు లేవని ప్రభుత్వ వైద్యుల బృందం తేల్చింది. ఈ మేరకు రూపొందించిన నివేదిక ఆదవారం మధ్యాహ్నం హైకోర్టుకు చేరింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి ఆయన్ను తరలించి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. శనివారం జరిగిన విచారణ సందర్భంగా సిఐడి పోలీసులు తనను కొట్టారంటూ సిఐడి కోర్టుకు రఘురామరాజు తన ఒంటిపై ఉన్న గాయాలను చూపిన సంగతి తెలిసిందే. ఇదే విషయం హైకోర్టులోనూ ప్రస్తావనకు రావడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరీక్షల అనంతరం రమేష్ ఆస్పత్రిలోనూ పరీక్షలు చేయించాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షల తరువాత సిఐడి అధికారులు ఆయన్ను నేరుగా గుంటూరు జైలుకు తరలించారు. ఇదే విషయాన్ని హైకోర్టులో ఎంపి తరపు లాయర్లు ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను సిఐడి అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ధిక్కరించారన్నారు. దీనిపై సిఐడి తరపు వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ పి. సుధాకర్‌రెడ్డి రమేష్ ఆస్పత్రిపై క్రిమినల్కేసులున్నాయని, ఆ ఆస్పత్రికి తరలిస్తే తెలుగుద్శేం పార్టీ కార్యాలయానికి తరలించినట్టేనని వాదించారు. ఈ వాదనలను విన్న తరువాత వైద్య సేవల నిమిత్తం రమేష్ ఆస్పత్రికి రఘురామరాజును తరలించాలని, వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని ఆదేశించింది.