Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి నిర్వహణ, ప్రజలకు కోవిడ్-19 వైద్య సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన కేంద్ర సర్కారు.. జనం నోళ్లు మూయించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. కరోనా కట్టడి, టీకాలు, ఇతర మందులు, ఆక్సిజన్ కొరత తీర్చడం వంటి చర్యల కంటే విమర్శకులపై ఉక్కుపాదం మోపేందుకే మోడీ సర్కారు అధిక సమయం కేటాయిస్తున్నదని ప్రస్తుతం సర్వత్రా విమర్శల వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ.. ప్రస్తుత సంక్షోభ సమయం.. మోడీ తీరును ప్రశ్నిస్తూ పోస్టర్లు వేసిన 25 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీరిని తాజాగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కారు పై నెట్టింట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు సైతం తీవ్రంగా స్పందిస్తున్నాయి. తాజాగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ''మోడీజీ.. మా పిల్లలకు దక్కాల్సిన టీకాలను మీరు విదేశాలకు ఎందుకు పంపించారు?'' అని రాసున్న పోస్టర్లు ఇటీవల ఢిల్లీలో సంచలనం రేపాయి.