Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పైసలు..పైసలు పెంచుతూ పెట్రోల్ ధరను కేంద్రం రూ.100కు తీసుకొచ్చింది. ఆదివారం పెట్రోల్‌పై 24పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. తాజా పెంపుతో దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటేసింది. స్థానిక పన్నులతో కలుపుకొని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఇక ముంబయిలో త్వరలోనే సెంచరీ కొట్టే దిశగా ఇంధన ధరలు కొనసాగుతున్నాయి. ఇంధన ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పన్నుల వాటానే అధికంగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను కింద లీటర్ పెట్రోల్‌పై రూ.32.90, డీజిల్‌పై రూ.31.80 వసూలు చేస్తోంది. ఆదివారం నాడు పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.96.22, డీజిల్ రూ.90.73 ధరలకు చేరుకున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయం ముగిసిన తర్వాత (మే 4 నుంచి) కేంద్రం చమురు ధరలు పెంచుతూ పోతోంది. ఎన్నికల అనంతరం ఇంధన ధరలు పెరగటం ఇది తొమ్మిదోసారి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.92.58, డీజిల్ ధర రూ.83.22కు చేరాయి. ముంబయిలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.98.88, డీజిల్ ధర రూ.90.40కు పెరిగాయి.