Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజీ: దేశంలో ఇప్పటికీ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆక్సిజన్ కొరత కారణంగా నిత్యం కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గోవాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ కరోనా రోగులకు వైద్య సదుపాయాలు అందిస్తున్న అతి పెద్ద ఆస్పత్రి గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జీఎంసీహెచ్)లో తాజాగా మరో ఎనిమిది మంది కరోనా రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ ఆక్సిజన్ కొరత మరణాల సంఖ్య 83కు పెరిగింది. అంతకుముందు శుక్రవారం 13, గురువారం 15, బుధవారం 21, మంగళవారం 26 మంది రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో అధికం తెల్లవారుజామునా 2 గంటల నుంచి 6 గంటల సమయంలో సంభవించి నట్టు సమాచారం. కాగా, గోవాలో గత 24 గంటల్లో 1,957 కేసులు, 58 మరణాలు నమోద య్యాయి. దీంతో గోవాలో మొత్తం మరణాలు 2,056, పాజిటివ్ కేసులు 1,34,542కు పెరిగా యి. ప్రస్తుతం 30,774 క్రియాశీల కేసులున్నాయి. దేశంలో అత్యధిక పాజిటివిటీ రేటు గోవాలోనే ఉండటంపై కేంద్రం ఆందోళన వ్యక్త చేస్తోంది.