Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు రాష్ట్రాలకు ముప్పు
- కర్నాటకలో నలుగురు మృతి
- కేరళను ముంచెత్తిన మరో ప్రకృతి విలయం
న్యూఢిల్లీ: తౌక్టే తుఫాను తీవ్రరూపం దాల్చింది. మంగళవారం గుజరాత్‌లోని పోర్బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశముంది. తీరం దాటేటప్పుడు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ తుఫాను వల్ల ఏడు రాష్ట్రాలకూ ముప్పు పొంచివుంది. కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, లక్ష్యదీప్, తమిళనాడు రాష్ట్రాల్లో తౌక్టే తుఫాను ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటికే తుఫాను కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గతంలో నిఫా వైరస్, తుఫాన్లు వెంటాడాయి. తాజాగా కరోనా బారినపడి కొలుకుంటున్న దశలో.. మరోసారి కేరళపై ప్రకృతి ప్రకోపించింది. దీంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వెంటనే సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ సర్కార్ అప్రమత్తమై యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు తీసుకుంటున్నది. కర్నాటకలోనూ ఆరు జిల్లాలు ప్రభావితమ య్యాయి. ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఆదివారం నాటికి వర్షాలు, వరదల్లో నలుగురు మరణించినట్టు అధికారులు ధ్రువీకరిం చారు. తౌక్టే తుఫాను గోవా రాష్ట్రాన్ని కూడా తాకింది. ఈ దెబ్బకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గుజరాత్ వైపు క్రమంగా తుఫాను రూటుమారింది. ముంబయి సహ ఉత్తర కొంకణ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన గాలులతో.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌పై కేంద్రహౌంశాఖమంత్రి అమిత్‌షా సమీక్షిం చారు. తౌక్టే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 53 ఎన్డీఆర్ఎఫ్ దళాలను రంగంలోకి దిగాయి. మత్స్యకారులను వేట లోకి వెళ్లవద్దని హెచ్చరిక చేశాయి. తౌక్టే తుఫాను సహాయ చర్యల కోసం వైమానిక దళం 16 విమానాలు, 18 హెలికాప్టర్లను సిద్ధం చేసింది.