Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛండీగఢ్: హర్యానాలోని హిసార్‌లో సాగు చట్టాలను రద్దు చేయమని కోరిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. టియర్‌గ్యాస్ ప్రయో గించారు. పలువురు రైతులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దీనితో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ హిసార్‌లో నూతనంగా నిర్మించిన ఓ ఆస్పత్రిని ప్రారంభించడా నికి వచ్చారు. ఈ సందర్భంగా పలువురు రైతులు కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసనలు తెలిపారు.
ముఖ్య మంత్రికి వ్యతిరేకంగా నినాదులు చేశారు. పోలీసు లు రైతులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నామనీ, అడ్డుకోవద్దంటూ రైతులు ముఖ్యమంత్రి సభాస్థలి వైపుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనితో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. రైతులు చెల్లాచెదురై పరుగులు పెడుతున్న సమయంలో పోలీసులు మరోసారి భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులపైకి రాళ్లురువ్వారు. హిసార్‌లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా రైతు నేతలు మాట్లా డుతూ అకారణంగా పోలీసులు తమపై లాఠీచార్జీ చేశారని అన్నారు. తాము ముఖ్యమంత్రికి సాగుచట్టాల రద్దుపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని విచక్షణారహితంగా కొట్టారని చెప్పారు. ఈ ఘటనపై సీఎం ఖట్టర్ స్పందిస్తూ కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రైతులు నిరసనలు చేసుకోచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఈనెల 24వరకు లాక్డౌన్ అమల్లో ఉంది. మొత్తంగా 6,85,312కేసులు, 6,546మరణాలు నమోదయ్యాయి.