Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనారోగుల నెత్తిన జీఎస్టీ భారం
- 12 నుంచి 18 శాతం వరకూ పన్ను వాయింపు
- ఆక్సిజన్ మొదలుకుని ప్రాణధార పరికరాలపై బాదుడు
- కనికరంలేని మోడీ సర్కార్
న్యూఢిల్లీ : ఇటు పెట్రోల్ ధరల్ని అమాంతంగా పెంచేస్తుంది. మరోవైపు కరోనా కాలంలో బాధితుల పట్లా ఏమాత్రం కనికరం చూపటంలేదు. ఆక్సిజన్ మొదలుకుని ప్రాణధార పరికరాలపై 12 నుంచి 18 శాతం వరకూ వస్తు,సేవల పన్ను (జీఎస్టీ)భారం మోపుతూ మోడీ సర్కార్ నిలువుదోపిడీకి పాల్పడుతున్నది. ప్రజల బాగోగులు చూడాల్సిన బీజేపీ ప్రభుత్వం..కరోనా బాధితులని కూడా చూడకుండా వారి జేబుల్లోనుంచి జీఎస్టీ పేరున బలవం తంగా గుంజేసుకుంటున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తు న్నారు. మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కోట్లాదిమంది కోవిడ్ బారిన పడ్డారు. ఎప్పుడు తమ ప్రాణాలు పోతా యోనని కరోనా పేషెంట్లు భయపడు తుంటే వారిని కాపా డుకోవటానికి వారి బంధువులంతా ప్రయత్నిస్తున్నారు. ఓ వైద్యం ఖరీదుగా మార్చేస్తే.. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చోద్యం చూస్తు న్నాయి. కేరళలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఐసీయూ,వెంటిలేటర్లకు ఒక రేటు నిర్ణయిస్తే..మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా ఈ విధానం అమలుకావటంలేదు. కార్పొరేట్ ఆస్పత్రులు లక్షలకు లక్షలు దండుకుంటున్నాయి. ఇక కోవిడ్ రోగుల చికిత్సకోసం వాడే మందులు, పరికరాలన్నింటిపై ఆరునుంచి 18 శాతం దాకా జీఎస్టీ భారం పడుతున్నది.వీటికి తోడు కరోనా ఆస్పత్రుల్లో చేరిన వారికి వైద్యంతో పాటు జీఎస్టీ పేరున పడేభారం అదనంగా 15శాతం వరకూ ఉంటున్నది. రెమ్‌డెసివిర్, మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్లు, సంబంధిత పరికరాలపై 12 శాతం జీఎస్టీ అమల్లో ఉన్నది. అత్యధికంగా ఔషధాలపై 12 నుంచి 18 శాతం భారం పడుతున్నది. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు సహా అన్నింటిపైనా ఈ వడ్డన కొనసాగుతున్నది.
పేద రోగులకు దిక్కెవరు..?
కరోనా తీవ్రత ఉన్న రోగికి వాడే మందులు,పరికరాల ఆధారంగా బిల్లుల్లో 15 నుంచి 20శాతం జీఎస్టీ పడు తున్నది. కార్పొరేట్ ఆస్పత్రిలో చేరినప్పటినుంచి..డిశ్చార్జి అయ్యేవరకు ఉపయోగించే అన్నింటిపైనా జీఎస్టీ బాదేస్తున్నారు.
జీఎస్టీ తగ్గించండి...
వినియోగం భారీగా ఉంటున్న నేపథ్యంలో వీటిపై జీఎస్టీని తగ్గించాలంటూ.. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. అది సత్వరం స్పందిస్తే బాధితులకు కొంతైనా ఊరట కలుగుతున్నదనే భావనవ్యక్తమవుతున్నది. మోడీ ప్రభుత్వం కోవిడ్ రోగులపట్ల జీఎస్టీ భారాలు వేయటం తగదనీ, ఇది వ్యాపారం కాదు..తమవాళ్లను బతికించుకునేపోరాటం చేస్తున్నారని ప్రతిపక్షపార్టీలు అంటున్నాయి. దీనికి కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
మాత్రం ససేమిరా అంటున్నారు.
జీఎస్టీ వేటిపై ఎంత..?
12 శాతం జీఎస్టీ పరిధి.. : మెడికల్గ్రేడ్ ఆక్సిజన్, కొవిడ్ నిర్ధారణ కిట్లు, రీజెంట్లు, వెంటిలేటర్లు, ఇతర శ్వాసపరికరాలు, మెకానికల్ విడిభాగాలు, ఫిల్టర్లు ఉన్న మాస్క్‌లు, రబ్బరు గ్లౌజ్‌లు, రక్షణ కండ్లద్దాలు, బ్యాండేజీలు, ఆపరేషన్‌కు వాడేవి,
18 శాతం జీఎస్టీ పరిధి..,
స్టెరిల్కైజేషన్కు ఉపయోగించే ఇథైల్ ఆల్కహాల్: సబ్బులు, చర్మ శుభ్రతకు వినియోగించేవి, శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, ప్రమాదకర వ్యర్థాలు వేసేందుకు వాడే కవర్లు, ప్లాస్టిక్‌తో చేసిన రక్షణ పరికరాలు, క్రిమిసంహారకాలు, టిష్యుపేపర్లు, న్యాప్కిన్లు, వస్త్రంతో తయారుచేసిన చేసిన గ్లౌజ్‌లు, ఇతర రక్షణ ఉత్పత్తులు, సెల్యులోజ్ ఫైబర్‌తో చేసిన మాస్క్‌లు, తలకు వాడే నెట్లు, రోగుల నుంచి ఫ్లూయిడ్స్ సేకరించే శానిటరీవేర్, ల్యాబొరేటరీ పరికరాలు, స్టెరిలైజేషన్‌కు వాడేవి, థర్మామీటర్లు, సైకోమీటర్లు, హైగ్రోమీటర్, క్యాలిబరేటింగ్ మీటర్లు, ఇలా కరోనా బాధితులకు మాత్రం తడిసిమోపడవుతున్నదని పేషెంట్ల బంధువులు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు.