Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రజారారుల పార్థివ దేహాల అప్పగింత
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌కు చెందిన సిపిఎం సీనియర్ నేత, కార్మిక సంఘం నాయకురాలు జ్యోత్స్న బోస్ (92) కరోనాతో కోల్‌కతాలో మరణించారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు నేత జ్యోతిబసు నుంచి ప్రేరణ పొందిన ఆమె తన పార్థివదేహాన్ని శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం అప్పగించాలని బతికున్న సమయంలో కోరారు. దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్‌ను జోత్స్న కుమార్తె సోమవారం పూర్తి చేసి, మతదేహాన్ని నగరంలోని ఆర్జి కార్ మెడికల్ కాలేజ్‌కు అందించారు. కరోనా రోగ లక్షణాలపై అధ్యయనం చేసేందుకు దేశంలోనే వినియోగిస్తున్న మొట్టమొదటి మహిళ పార్థివదేహం జ్యోత్స్న బోస్‌దే కావడం గమనార్హం. శరీరంలో కోవిడ్-19 ప్రవేశించిన కారణంగా వచ్చిన మార్పులపై పూర్తి పరిశోధన చేయనున్నారు. బెంగాల్లో అవయవాల విరాళ ప్రచార సంస్థ వ్యవస్థాపకుడు, వామపక్ష సీనియర్ నేత బ్రజారారు కూడా ఇటీవల కరోనాతో మరణించారు. ఆయన పార్థివ దేహాన్ని శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చారు. -