Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్‌తో వైద్యుల మరణాల్లో బీహార్, యుపి, ఢిల్లీలే టాప్
న్యూఢిల్లీ : గతేడాది కోవిడ్‌తో దేశవ్యాప్తంగా దాదాపు 730 మంది డాక్టర్లను కోల్పోయామని, ఈ ఏడాది ఇప్పటివరకూ 244మంది డాక్టర్లు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షుడు జెఎ జయలాల్ తెలిపారు. సెకండ్ వేవ్‌లో కోవిడ్ కారణంగా గరిష్ట సంఖ్యలో డాక్టర్లు చనిపోయిన రాష్ట్రాల్లో బీహార్ (69), ఉత్తరప్రదేశ్ (34), ఢిల్లీ (27) ఉన్నాయి. ఐఎంఎ రిజిస్ట్రీ ఇచ్చిన వివరాల ప్రకారం కోవిడ్ వల్ల చనిపోయిన వైద్యుల్లో అత్యంత పిన్న వయస్కులు ఢిల్లీకి చెందిన డాక్టర్ అనస్ మిజాహిద్ (25), పెద్ద వయసు వారిలో కోల్‌కతాకి చెందిన డాక్టర్ అనిల్ కుమార్ రక్షిత్ (87) ఉన్నారు. సెకండ్ వేవ్ అందరికీ చాలా తీవ్రమైన అనుభవాలను మిగుల్చుతుండగా, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మరీ దారుణంగా పరిణమించిందని జయలాల్ పేర్కొన్నారు. ఈ వైరస్ నుంచి రక్షణ కల్పించే ఉద్దేశంతో ముందుగా మెడికల్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఐఎంఎ రిజిస్ట్రీ ప్రకారం మరణించిన డాక్టర్ల సంఖ్య రాష్ట్రాలవారీగా ఇలా వుంది. ఆంధ్రప్రదేశ్ (21), అస్సాం (2), చత్తీస్‌గఢ్ (3), గుజరాత్ (2), గోవా (1), హర్యానా (2), జమ్ము కాశ్మీర్ (3), కర్నాటక (8), కేరళ (2), మధ్యప్రదేశ్ (5), మహారాష్ట్ర (13), ఒడిషా (8), తమిళనాడు (10), తెలంగాణా (19).