Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19పై సౌమ్య స్వామినాథన్
న్యూఢిల్లీ : భారత్లో ప్రమాదకర కరోనా మహమ్మారిపై ప్రపంచ ఆరో గ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చ రించారు. కోవిడ్-19 తదనంతర పరిణామాలు రానున్నరోజుల్లో ఉంటా యని ఆమె అంచనావేశారు. దేశంలో కరోనా మహమ్మారి పరిస్థితులపై దృష్టి సారిస్తున్న ఆమె ఈవ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ఆరోగ్యసంస్థలో కీలక శాస్త్ర వేత్త స్థాయిలో సౌమ్యస్వామినాథన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కరోనా మహమ్మారి ఎదుర్కొనే క్రమంలో రానున్న 6 నుంచి 18 నెలల్లో చేసే ప్రయత్నాలు చాలా కీలకమని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. వైరస్ పరిణా మం, వైవిధ్యాలను కొనసాగించే సామర్థ్యం మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. ఇది వ్యాక్సిన్ల రక్షిత రోగ నిరోధక శక్తి వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇందులో చాలా మార్పు వస్తున్నది'' అని ఆమె తెలిపారు.