Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రక్షణ పరిశోధకాభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ కోవిడ్ డ్రగ్ 2-డియోక్సీ-డీ- గ్లూకోజ్ (2-డీజీ) విడుదలైంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2-డీజీ తొలి బ్యాచ్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2-డీజీ డ్రగ్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు అందజేశారు. అనంతరం దీనిని ఢిల్లీ ఏయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రన్‌దీప్ గులేరియాకు అందజేశారు. కాగా, ఈ 2-డీజీ డ్రగ్ ద్వారా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ రికవరీ సమయంతో పాటు ఆక్సిజన్‌పై ఆధారపడే అవసరం తగ్గుతుందని హర్షవర్ధన్ తెలిపారు. డీఆర్డీవో సహకారంతో రాజ్‌నాథ్‌సింగ్ నాయకత్వంలో కోవిడ్-19కు వ్యతిరేకంగా తయారైన తొలి స్వదేశీ ఔషధం ఇదే కావచ్చని వెల్లడించారు. కరోనాపై వ్యతిరేకపోరులో భాగంగా రానున్న రోజుల్లో భారత్‌కే కాకుండా ప్రపంచానికి కూడా ఈ డ్రగ్ ఉపయోగపడుతుందని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. ఏడాది నుంచి కరోనాపై మనం పోరాడుతున్నామనీ, మన శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారని చెప్పారు. ఇది ప్రజలకు అందుబాటులో ఉంటుందని హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఆర్డీవో, ఆ సంస్థ శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. కాగా, ఈ డ్రగ్ ధరను డీఆర్డీఓ ఇంకా ప్రకటించలేదు. కరోనాపై పోరులో భాగంగా ఈ డ్రగ్ అత్యవసర వినియోగానికి ఈనెల 1న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం విదితమే.