Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబిఐ కార్యాలయం వద్ద మమత ఆందోళన
- కోల్‌కతాలో ఉద్రిక్తత
కోల్‌కతా: నారదా స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీలతో సహా నలుగురిని సోమవారం సిబిఐ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. చివ రికి వీరికి సాయంత్రం బెయిల్ లభించింది. ఈ విష యం తెలియగానే ఎజెసి బోస్ రోడ్‌లోని నిజాం ప్యాలెస్‌లోని సిబిఐ కార్యాలయం వద్దకు ముఖ్య మంత్రి మమతా బెనర్జీ చేరుకుని, ఆందోళనకు దిగారు. 'నిబంధనలకు అనుగుణంగా వారి అరెస్టులు జరగలేదు. నన్ను కూడా అరెస్టు చేయండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే బిజెపి ఈ అరెస్టులకు పాల్పడిందని మమ తా బెనర్జీ విమర్శించారు. స్పీకర్, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా మంత్రులను ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. కార్యాలయం వెలుపల టిఎంసి నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.
మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీమంత్రి, కోల్‌కతా మాజీ మేయర్ సోవన్ ఛటర్జీలను సోమవారం ఉదయమే వారి ఇళ్లలో సిబిఐ అరెస్టు చేసింది. వీరి అరెస్టుకు గవర్నర్ జగదీప్ ధనకర్ ఈ నెల 7న అనుమతి ఇచ్చినట్లు సిబిఐ అధికారులు చెబు తున్నారు. మమతా బెనర్జీ ఆందోళనపై గవర్నర్ జగదీప్ ధంకర్ స్పందించారు. పరిస్థితి అన్యాయంగానూ, అరాచకంగానూ ఉందని ట్వీట్ చేశారు. రాజ్యాంగం నిబంధనలు, నియమాలు పాటించాలని మమతకు విజ్ఞప్తి చేశారు.
2014లో నారద న్యూస్ పోర్టల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో ప్రస్తుతం అరెస్టయిన నలుగురు రూ.4 లక్షలు నుంచి 5 లక్షలు లంచం తీసుకున్నారు. నారద న్యూస్ పోర్టల్ సిఇఒ, జర్నలిస్ట్ మధ్యూ సామ్యూల్స్ మారు పేరుతో బెంగాల్లో పరిశ్రమ స్థాపిస్తున్న వ్యాపారవేత్తగా టిఎంసి నేతలను కలిశారు. ఏడుగురు టిఎంసి ఎంపిలు, నలుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే, ఒక పోలీసు అధికారికి లంచం ఇచ్చి వాటి దృశ్యాలను చిత్రీకరించారు. అరెస్టయిన నలుగురితోపాటు ప్రస్తుత బిజెపి ప్రతిపక్ష నేత సువేందు అధికారి, ముకుల్ రారు, సౌగత రారు, కకోలి ఘోష్ దస్తిదర్, సుల్తాన్ అహ్మద్, అపరూప పొద్దార్, ఇక్బాల్ ప్రసూన్ బెనర్జీ, హెచ్ఎంఎస్ మిర్జా కూడా లంచం తీసుకున్నారు. వీరిలో మాజీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ మరణించారు.
'నారద టేపులు'గా పేర్కొనే ఈ దృశ్యాలను 2016 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదల చేశారు. 2017 మార్చిలో ఈ కేసులో ప్రాథమిక విచారణ చేయాలని సిబిఐకు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా సూచించింది. అదే ఏడాది ఏప్రిల్ 17న 13మంది టిఎంసి నేతలు, పార్టీ కార్యకర్తలపై సిబిఐ చార్జిషీటు నమోదు చేసింది.