Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై, భవనాల కూల్చివేతలపై వ్యక్తమవుతున్న
- అభ్యంతరాలకు ప్రభుత్వం ప్రతిస్పందించాలి
సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్టు ను ఒక జాతీయ ప్రాధాన్యత గల ప్రాజెక్టుగా పరిగణించి చేపట్టడం ఏ పరిస్థితుల్లోనైనా ప్రశ్నించదగ్గదే. ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో మరీ ప్రశ్నించదగినది అయింది. ఒక కొత్త పార్లమెంటు భవనాన్ని, ప్రధానికి, ఉప రాష్ట్రపతి వంటి నేతలకు నివాస గృహాలను నిర్మించడం కోసం ఈ ప్రాజెక్టు చేపట్టారు. పార్లమెంటుకు కొత్త భవనం అవసరమే. పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను తిరిగి ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది. ఐతే ఆ పేరుతో ఇప్పుడు నిర్మిస్తున్న భవనాల నమూనాలు గాని, ఇటువంటి సమయంలో నిర్మించడం కాని ఆ భవనాల అవసరం కన్నా ఆడంబరాన్ని, దర్పాన్ని ప్రదర్శించడం పట్ల పాలకుల మోజునే సూచిస్తున్నాయి. ప్రస్తుత మహమ్మారి సృష్టిస్తున్న శిథిóలాల నడుమ నిర్మించే మహా విగ్రహంలా ఈ నిర్మాణం నిలిచి ప్రజల మేలు పట్టని ప్రభుత్వ పాలనకు సంకేతంగా నిలిచిపోనుంది. 2024లో రానున్న లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ పట్టుదల అది దారి తప్పిన వైనానికి సూచిక. కేంద్ర ప్రభుత్వానికి పట్టుకున్న ప్రచారార్భాట జాఢ్యానికి సంకేతం. ఏకంగా ఓ వరస మొత్తం భవనాలను ఉన్నవాటిని కూలగొట్టి అక్కడ కొత్తవాటిని నిర్మించడం ఏ మాత్రమూ సమర్ధనీయం కాదు. గత వారం 76 మంది మేధావులు, కళాకారులు, రచయితలు, మ్యూజియంల నిర్వాహకులు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త భవన సముదాయాన్ని నిర్మించడం కోసం నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియా ను, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ను, నేషనల్ ఆర్కైవ్స్ భవనం వెనుకభాగాన్ని కూలగొట్టడంపై వారు తమ అభ్యంతరాలను తెలిపారు.
వెంటనే ప్రాజెక్టు పనులను నిలుపుచేసి తర్వాత ఏం చేయాలో నిర్ణయించేందుకు విస్తృతంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ఆ నిపుణులు కోరారు. ఆ కేంద్రాలలో భద్రపరచిన అమూల్యమైన చారిత్రక ఆధారాలను, కళారూపాలను, వస్తువులను పరిరక్షించడం పట్ల వ్యక్తమౌతున్న ఆందోళన న్యాయమైనది. ఆక్కడ ఉన్న అమూల్యమైన చారిత్రక పత్రాలు, రాతప్రతులు భద్రపరచడం సాధారణ పరిస్థితుల్లో సైతం ఒక సవాలే. దానికి వివరమైన ప్రణాళిక, నైపుణ్యం కావాలి. అటువంటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి ఏ మార్పులు చేయాలన్నా అది విస్తృత సంప్రదింపుల తర్వాతనే చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా పాటించే విధానం. కాని దానికి పూర్తి భిన్నంగా, గోప్యంగా, నిర్లక్ష్యంగా ఇప్పుడు వ్యవహారం నడుస్తోంది. నేషనల్ మ్యూజియంలో భద్రపరచిన కళాఖండాల ఇన్వెంటరీ (పూర్తి వివరాలతో కూడిన జాబితా) ఎక్కడా లేదని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. అంటే వాటిలో చాలా గల్లంతయే అవకాశం గాని, వాటి పట్ల అజాగ్రత్తగా వ్యవహరించే ప్రమాదం గాని ఉన్నాయి. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు చాలా తొందరపాటుతో చేపట్టడం జరిగిందనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. ఆ నిర్మాణం జరుగుతున్న చోట ఎటువంటి ఫోటోగ్రఫీని అనుమతించడంలేదు. ప్రజానీకం కళ్ళబడకుండా ఈప్రాజెక్టు నడిచిపోవాలన్న ప్రభుత్వ వైఖరి దాని అసహ నాన్ని సూచిస్తోంది. దేశం ఒక అసాధారణ రీతిలో ఆరోగ్య సంక్షోభంలో చిక్కుకుని వుంది. దాని ప్రభావం ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలమీద కూడా పడు తోంది. ఇప్పుడీ ప్రాజెక్టును నిలిపివేసి ప్రతిపక్షాలను, ప్రజలను విశ్వాసంలోకి తీసు కుని భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించడం వలన ప్రభుత్వానికి కలిగే నష్టం ఏమీ లేదు.