Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం ఆదేశాలతో రఘురామరాజు తరలింపు
- అక్కడే వైద్య పరీక్షలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
గుంటూరు జైలులో ఉన్న నర్సాపురం ఎంపి రఘురామకృష్ణ రాజును సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి అధికార యంత్రాంగం తరలించింది. రాత్రి ఏడు గంటలకు జైలు వద్దకు వచ్చిన పోలీసు ఉన్నతాధి కారులు అవసరమైన లాంఛనాలను హుటాహుటిన పూర్తి చేశారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఎంపి సొంత వాహనంలో రోడ్డుమార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరో రెండు వాహనాల్లో పోలీసలు బందోబస్తగా ఎంపి వెడుతున్న వాహనాన్ని అనుసరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ఈ తరలింపును పర్యవేక్షించాలని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణా ప్రభుత్వ అధికారులతో మాట్లాడటంతో పాటు, తరలింపు సాగుతున్న తీరును ఎప్పటికప్పుడు తెలుసుకున్నటుల సమాచారం. అంతకుముందు ఈ వ్యవహారంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించాలన్న సుప్రీం ఆదేశాలు సోమవారం మధ్యాహ్నామే వెలువడి నప్పటికీ, అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో అధికారయంత్రాంగం ఆ దిశలో చర్యలు ప్రారంభించలేదు. సాయంత్రం ఐదు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగించింది. దీంతో రఘురామరాజు భార్య సిఎస్‌కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలిసింది. గుంటూరు జైలులో తన భర్తకు ప్రాణహాని ఉందని స్పష్టమైన సమాచారం తన వద్దని, తన భర్తకు ఏదన్నా జరిగితే సిఎస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నట్లు సమాచారం. రఘురామరాజు తరపు లాయర్లు కూడ సిఎస్‌తో మాట్లాడారు. సుప్రీంకోర్టు అధికారుల దృష్టికీ ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లారు. దీంతో సుప్రీం అధికారులు కూడా రాష్ట్ర అధికారయంత్రాంగంతో మాట్లాడారు. ఈ లోగా అధికారిక ఉత్తర్వులు వెలువడంతో ఆ కాపీని మెయిల్ ద్వారా సిఎస్‌కు పంపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారయంత్రాంగం హుటాహుటిన కదిలింది.
అంతకుముందు రఘురామ కష్ణరాజు బెయిల్ పిటిషన్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అంశానికి సంబంధించి రెండు వేర్వేరు స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీం కోర్టులో ఆయన తరపు న్యాయవాది ఆదినారాయణ రావు దాఖలు చేశారు. సోమవారం ఈ పిటిషన్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ గువారు నేతత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఖెయిల్పిటిషన్పై విచారణను ఈ నెల 20వ తేదికి వాయిదా వేసింది. ఎంపి రఘురామ కష్ణరాజు తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, ఆదినారాయణ రావు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే, వివి గిరి వాదనలు వినిపించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించాలని కింది కోర్టు ఆదేశించినా అధికారులు ఆ పనిచేయలేదని ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టు దష్టికి తీసుకెళ్లారు. కస్టడీలో రఘురామను తీవ్రంగా కొట్టి హింసించారని, అరికాళ్లకు తగిలిన గాయాలను ఎంపి మెజిస్ట్రేట్‌కు చూపించారని తెలిపారు. రమేశ్ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలని కోరారు. రఘురామ కష్ణరాజు వైద్య పరీక్షలకు విజయవాడ మణిపాల్ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినించారు. రఘురామ కష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని తెలిపారు. రమేష్ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయాలన్న రోహత్గీ వాదనలపై దవే అభ్యంతరం తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యులతో పరీక్షలు చేయిస్తే అభ్యంతరం లేదన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో అధికారపార్టీ ఎంపిలు సలహాదారులుగా ఉన్నారని రఘురామరాజు తరపు లాయర్లు అభ్యంతరం తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్ స్పందిస్తూ ఆర్మీ ఆస్పత్రి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై రఘురామ తరపున న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ సికింద్రాబాద్‌లో ఉందని, అక్కడి నుంచే నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలిపారు. ఆంధ్రాలో విశాఖపట్నంలో నేవల్ బేస్ ఆస్పత్రి ఉందని, అది కూడా 300 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరమని వివరించారు. అనంతరం తదుపరి విచారణను ధర్మాసనం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఈలోపు మెయిల్ ద్వారా సంబంధిత పత్రాలను పంపించాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల తరువాత తిరిగి ప్రారంభమైన విచారణలో రఘురామరాజును వైద్య పరీక్షలకు 10 కిలో మీటర్ల దూరంలో విజయవాడ మణిపాల్ ఆస్పత్రి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే తెలిపారు. వైద్య పరీక్షలకు ఢిల్లీ ఎయిమ్స్ మంచిదని రఘురామ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ అన్నారు. ఎయిమ్స్‌కు తరలింపుపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ (ఎస్జి) తుషార్ మెహతా అన్నారు. పరీక్షలు ఆర్మీ ఆస్పత్రిలో ఎందుకు నిర్వహించ కూడదని జస్టిస్ వినీత్ శరన్ ప్రశ్నించారు. ఆర్మీ ఆస్పత్రిని రాజకీయాల్లోకి లాగడం ఎందుకని ఎస్జి వ్యాఖ్యానించగా.. ఇందులో రాజకీయం లేదని, ఒక న్యాయాధి కారిని నియమిస్తామని ధర్మాసనం చెప్పింది. అనంతరం ఆ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎంపి ఒంటిపై ఉన్న గాయాల పరిశీలనకు రమేష్ ఆస్పత్రికి తరలించాలంటూ మెజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌ను జూన్‌కు హైకోర్టు వాయిదా వేసింది
సుప్రీంను ఆశ్రయించిన టివి 5, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
ఎంపి రఘురామ కష్ణరాజు వ్యవహారంలో తమపై ఏపి ప్రభుత్వంపై అక్రమంగా దేశద్రోహం కేసు పెట్టిందని పేర్కొంటూ టివి 5, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఉద్దేశపూర్వకంగానే తమ ఛానళ్లను ఎఫ్ఐఆర్లో చేర్చారని పేర్కొన్నాయి. సిఐడి దర్యాప్తుపై స్టే విధించాలని కోరాయి.
సుప్రీం ఏం చెప్పింది
'రఘురామకృష్ణ రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. వైద్య పరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలి. వైద్య పరీక్షలను వీడియో తీయాలి. నివేదికను సీల్డ్ కవర్లో అందించాలి. ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న సమయాన్ని జ్యుడిషియల్ కస్టడీగా భావించాలి'.