Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ దెబ్బకు 1200 మంది మృతి
ముంబయి: కరోనామహమ్మారి కోరలు చాస్తున్నా.. కొన్ని రంగాలు మాత్రం తమ సేవల్ని కొనసాగిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం చూపు తున్నదనీ ఉద్యోగసంఘాలు తెలిపాయి. కోవిడ్ విరుచుకుపడటంతో..ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్టు 'అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య' ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ఫ్రంట్‌లైన్ వర్కర్లనిట పేర్కొన్నారు. వెయ్యిమందికిపైగా తమ సహచరుల్నికోల్పోవటం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కరోనా భారీస్థాయిలో విజంభిస్తున్న సమయంలో .. అన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లేదా పాక్షిక లాక్డౌన్లు విధించాయి. అయితే అత్యవసర రంగంలో ఉన్న బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయి. 50 శాతం సిబ్బందితో పనిచేయడం, పనివేళల్లో కొన్ని సడలింపులు కల్పించినప్పటికీ.. సేవల్ని మాత్రం నిరంతరంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది ఉద్యోగులు వైరస్‌బారినపడుతున్నారు. ఇప్పటివరకు 1200 మంది ఉద్యోగులు చనిపోయారని 'అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య' ప్రధాన కార్యదర్శి సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. భారీసంఖ్యలో పలువురు కోవిడ్‌తో బాధపడుతున్నారని వివరించారు. కరోనా బారిన పడ్డ ఉద్యోగులు, మరణించిన వారి వివరాల్ని పంచుకోవడానికి అనేక బ్యాంకులు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంపై కూడా సరైన విధివిధానాలను ప్రకటించడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.