Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ కన్సార్టియం చీఫ్ పదవికి రాజీనామా..!
న్యూఢిల్లీ : సీనియర్ వైరాలజిస్ట్ డా. షాహీద్ జమాల్..సార్క్-కోవిడ్-2జినోమిక్స్ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) చీఫ్ బాధ్యతల నుంంచి తప్పుకున్నారు. ఆయన ఎందుకు తప్పుకున్నాడో స్పష్టంగా తెలియనప్పటికీ.. కోవిడ్‌ను కట్టడిచేయడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలు నచ్చకపోవడం వల్లే తప్పుకున్నారన్న వార్తలొస్తున్నాయి. వాస్తవానికి 800 మంది భారతీయశాస్త్రవేత్తలు గతనెలలో ప్రధాని మోడీని కలిసి కరోనాకు సంబంధించిన డేటా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు, కానీ ఇంతవరకూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్పందించలేదు. వీటికి తోడు కోవిడ్ విజృంభించనున్నదని మార్చినెలలోనే కన్సార్టియం హెచ్చరిక చేసింది. ఇప్పటివరకూ కరోనా వైరస్ నియంత్రణపై మోడీ ప్రభుత్వంతీరు కారణంగా మరింత ప్రాణనష్టం జరుగుతున్నదన్న భావన కూడా ఆయనలో వ్యక్తమవుతున్నది. దేశంలో కోవిడ్-19 రకాలపై ప్రయోగశాల, మహమ్మారిపై నిఘా కోసం ...శాస్త్రీయ సలహా బృందంతో కూడిన ఈ కన్సార్టియంను గత ఏడాది డిసెంబర్లో కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందానికి షాహీద్ చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అశోకా యూనివర్సిటీలోని త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్స్ డైరెక్టర్‌గా షాహీద్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మొత్తం జీనోమ్ స్వీక్వెనింగ్ ద్వారా వైరస్ జన్యుమార్పుల గురించి నిరంతరం ఈ కన్సార్టియం పర్యవేక్షిస్తున్నది.