Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్‌పై కేంద్రం తీరు ప్రజాస్వామ్య,
- రాజ్యాంగ విరుద్ధం : విశ్లేషకులు
- టీకాల వేర్వేరు ధరలపై సర్వత్రా విమర్శలు
- ప్రయివేట్ కంపెనీలవైపే మోడీ సర్కార్ మొగ్గు
- రేట్లు నిర్ణయించే అధికారం కార్పొరేట్లకే..!
మోడీ సర్కార్ అనుసరిస్తున్న వ్యాక్సిన్ బిజినెస్పాలసీపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇష్టానుసారంగా
టీకా ధరలు నిర్ణయించే అధికారాన్ని బడా కంపెనీలకు అప్పగించటం ప్రజాస్వామ్యవ్యతిరేకం.. రాజ్యాంగవిరుద్ధమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలకు అమ్ముకోవటానికి బీజేపీ సర్కార్ మొగ్గుచూపుతున్నతీరుపై ఇదేం వ్యాక్సిన్ పాలసీ అంటూ ప్రజలు, ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగు తోంది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణా లు సంభవిస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరతతో పాటు టీకాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కరోనా వ్యాక్సిన్ పాలసీ వివాదాస్పదమవుతోంది. ఈ టీకా పాలసీ ప్రజాస్వామ్య వ్యతిరేక.. రాజ్యాంగ విరుద్ధమైనదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలు కేంద్రం ఇటీవల ''లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్ట్రాటజీ'' అనే విధానాన్ని ప్రకటిం చింది. ఇందులోని పారా 7లో ''ఫేస్-3లో.. జాతీయ టీకా వ్యూహం సరళీకృత వ్యాక్సిన్ ధర, వ్యాక్సిన్ కవరేజీని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒకవైపు టీకా తయారీదారు లను వారి ఉత్పత్తిని వేగంగా పెంచడానికి ప్రోత్సహిస్తుంది. మరోవైపు ఇది కొత్త టీకా తయారీదారులను ఆకర్షిస్తుంది'' అని పేర్కొంది. సైతం తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ తీరు, ఒకే టీకాకు వేర్వేరు ధరలు ఉండటమే. కేంద్ర ప్రకటించిన టీకా పాలసీలో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను దేశంలోని రాష్ట్రాలకు 300, భారత్ బయోటెక్ టీకా రూ.400 విక్రయిస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రూ.150కే విక్రయిస్తుంది. అలాగే, తన ఉత్పత్తిలో 50 శాతం కేంద్రానికి విక్రయించడంతో పాటు మరో 50 శాతం రాష్ట్రాలకు, ఆస్పత్రులకు రూ.600లకు అందించేకు సీరం ఒకే చెప్పింది. ''ఒకే టీకాకు వేరువేరు ధరలు.. రాష్ట్రాల పట్ల ప్రయివేటు కంపెనీలు వివక్ష చూపేందుకు కేంద్రం ఎందుకు అనుమతించింది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగపరమైన దురాగతం, ఆర్థిక అసమానత.. దేశ సంక్షేమానికి వ్యతిరేకమైన చర్య. ఎందుకంటే దేశం రాష్ట్రాలతో కూడి ఉంది. యూనియన్‌లో కేంద్ర పాలిత ప్రాంతాలు తప్ప ప్రత్యేక భూభాగం లేదు'' అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక ప్రయివేటు కంపెనీకి టీకా కోసం రాష్ట్ర ప్రజలు రెట్టింపు ధరను ఎందుకు చెల్లించాలి? కేంద్ర తాజా విధానం ఆరోగ్య హక్కులను కల్పించే ఆర్టికల్ 21 (జీవించే హక్కు)ను పూర్తిగా ఉల్లంఘిస్తోంది. దీనితో పాటు ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ను కూడా ఉల్లంఘిస్తోంది.''
విభిన్న ధరలు...
కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో ధరలను ''మార్కెట్ శక్తులు'' నిర్ణయించాలనే వాదనలో ఉండింది. దీనికి అనుగుణంగానే రాష్ట్రాలకు కోవిషీల్డ్ ఒక డోసు రూ.300, కోవాగ్జిన్ డోసు రూ.400, ప్రయివేటు సంస్థలకు వరుసగా రూ.600, రూ.1200 విక్రయించే విధంగా పేర్కొంది. అయితే, ప్రపంచం లోని పలు దేశాల్లో టీకా ధరలు గమనిస్తే.. యూరోపియన్ మార్కెట్లో సీరం టీకా డోసు రూ.160కి అందుబాటులో ఉంది. గావి (వ్యాక్సిన్ అలయన్స్)కు రూ.210, యూకేలో రూ.222, యూ ఎస్‌లో రూ.297లకు లభిస్తోంది. అయితే, సీరం బహిరంగంగా ప్రకటించిన ధరలు కేంద్ర ప్రభుత్వం చెల్లించే ధర కంటే 200-800 శాతం ఎక్కువ చేయబోతున్నట్టు స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సంక్షోభ సమయంలో లాభం పొందడానికి ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం ఎలా ఒక ప్రయివేటు కంపెనీకి అనుమతి ఇస్తుంది? ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వ అనుమతా? దీంతో పాలకులకు ప్రయోజనం ఏంటి? అనే ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి.
రాజ్యాంగానికి భిన్నంగా..
''కోవిషీల్డ్‌ను రూ.300, కోవాగ్జిన్‌ను రూ.400లకు రాష్ట్రాలకు విక్రయించడానికి కేవలం కంపెనీలు మాత్రమే నిర్ణయించలేదు.. దీనికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒకే వ్యాక్సిన్ వేరువేరు ధరలు ఉండటానికి ఎలాంటి సమర్థనీయత లేదు. మరింత తీవ్రమైన పర్యవసానం ఏమిటంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ధరకు రెట్టింపు చెల్లించాల్సి వస్తే.. రాష్ట్రాలు తమ విలువైన వనరులను ఇతర ఆరోగ్య, సామాజిక సంక్షేమ కార్యక్రమాల నుంచి మళ్లించాల్సి వస్తుంది. పైన తెలిపిన ఈ అంశాలన్నీ కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 హక్కులను ఉల్లంఘిస్తుంది'' అని న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వెల్లడించారు. అలాగే, ఆర్టికల్ 39, 47, ఎడో షెడ్యూల్లోని పలు అంశాలు ఈ టీకా పాలసీ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనదిగా స్పష్టం చేస్తున్నాయి. ఇక 50 శాతం వ్యాక్సిన్ మోతాదులను ఎక్కడ పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా పాలసీలో స్పష్టంగా పేర్కొనలేదు. దీనిపై మాజీ ఆరోగ్య కార్యదర్శి కె.సుజాత రావు స్పందిస్తూ.. సంప్రదింపులు లేకుండా ధరలు నిర్ణయించడానికి టీకా తయారీ దారులను అనుమతించాలనే మోడీ సర్కారు విధానం ''పూర్తిగా హాస్యాస్పదంగా'' ఉందనీ, టీకాలు అనేవి ''లగ్జరీ కాదు.. స్వేచ్ఛ విప ణీలో విస్తృతంగా అందుబాటులో ఉండాల''ని అన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం కేంద్ర రూ.35 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి నట్లైతే..ప్రస్తుతం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ కోసం ఎందుకు నిధిలివ్వాలి? అంటూ తనతో పాటు ప్రతిఒక్కరు అడుగుతున్న ప్రశ్న అని అన్నారు. ఇదిలా ఉండగా, భారత్ బయోటెక్ టీకా అభివృద్ధి కోసం ఐసీఎంఆర్, పూణే వైరాలజీ ఇనిస్టిట్యూట్లు సైతం పాలు పంచుకున్నాయి. అయినప్పటికీ భారత్ బయోటెక్ రాష్ట్రాలకు టీకాను రూ.400 విక్రయించే విధంగా కేంద్రం ఒకే చెప్పడం గమనార్హం.