Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికపతనంతో జీవనోపాధికి దెబ్బ
- ఉపాధి కరువై రుణాలతో నెట్టుకొస్తున్న కుటుంబాలు
- 82శాతం పెరిగిన గోల్డ్ లోన్
న్యూఢిల్లీ : కరోనా రెండో వేవ్ దెబ్బకు పేదలు, మధ్య తరగతి విలవిల్లాడుతున్నారు. అనేక రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటించాయి. దాంతో కోట్లాదిమందికి జీవనోపాధి కరు వైంది. ముఖ్యంగా దినసరి కూలీలు, వీధి వ్యాపారులు, అసంఘటిత కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఒక అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో పోయేలా లేదు. దాంతో కోట్లాది కుటుంబాలు అప్పులు చేసి రోజులు వెళ్లదీయాల్సి వస్తోంది. మధ్య తరగతి కుటుం బాలు తమవద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని బ్యాంకులో కుదవపెట్టి రుణాలు తీసుకుంటే, మరికొంత మంది అమ్ముకుంటున్నారు. గత కొద్ది వారాలుగా దేశవ్యాప్తంగా గోల్డ్ లోన్లు భారీగా పెరిగాయని, ఉపాధిలేమి, ఆర్థిక సంక్షోభం ఈ పరిణామానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
గత ఆర్థిక సంవత్సరం (మార్చి2020-మార్చి 2021)లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల గోల్డ్ రుణాలు దాదాపు 15శాతం పెరిగాయి. అలాగే బ్యాంకుల ద్వారా మంజూరైన గోల్డ్ రుణాలు రూ.33,303(మార్చి 2020) నుంచి రూ.60,464కోట్లకు (మార్చి 2021నాటికి) పెరిగాయి. బ్యాంకుల గోల్డ్ రుణాల్లో 82శాతం పెరుగుదల నమోదైంది. మార్కెట్లో అన్సెక్యూర్డ్ లోన్లు అందుబాటులో లేనందున, గోల్డ్ రుణాలు ఒక్కటే సాధారణ ప్రజల ముందున్న అవకాశమని ముత్తూట్ ఫైన్కార్పో ఛైర్మెన్ జాన్ ముత్తూట్ అభిప్రాయపడ్డారు. ఃఃదేశవ్యాప్తంగా మా శాఖలున్నాయి. ఉత్తరం, తూర్పు, పశ్చిమ శాఖల్లో గోల్డ్ లోన్ కోసం కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అలాగే దక్షిణాదిన చూస్తే, తెలంగాణ, కర్నాటకల్లోని గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ ఏర్పడింది. లాక్డౌన్, కరోనా కారణంగా శాఖా కార్యకలా పాలు నిర్వహించటం ఇప్పుడు కాస్తా క్లిష్టంగా మారిందిఃః అని జాన్ ముత్తూట్ చెప్పారు.