Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసుల సంఖ్య తగ్గితే చాలదు : డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్
న్యూఢిల్లీ : భారత్లో కరోనా పాజిటివిటీ చాలా ఎక్కువగా ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ అన్నారు. వైరస్ వ్యాప్తి గరిష్టస్థాయికి చేరుకుంది, ఇక నుంచి వైరస్ తగ్గుముఖం పడుతుందని భావించడానికి వీల్లేదని ఆమె అన్నారు. దేశంలో రోజువారీ కొత్త కేసుల నమోదు గత కొద్ది రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతోంది. అయితే ఈ ఒక్క మార్పుతో వైరస్ వ్యాప్తి తగ్గుతుందని భావించడానికి వీల్లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జాతీయ ఆంగ్ల దినపత్రికతో ఆమె మాట్లా డుతూ..''భారత్లో పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉంది. మొత్తం టెస్టుల్లో 20శాతం కరోనా సోకినవారు ఉంటున్నారు. ఇదొక ప్రమాద హెచ్చరిక. అనేక రాష్ట్రాల్లో టెస్టింగ్ చాలా పరిమితంగా చేస్తున్నా''రని అన్నారు.