Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనాథలైన పిల్లకు నెలకు రూ. 2,500 పెన్షన్
- సంపాదించే పెద్దను కోల్పోయిన ఫ్యామిలీకి ఎక్స్ గ్రేషయా, పెన్షన్ :ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
యావత్ ప్రపంచాన్ని కరోనా అతలాకుతల%శీ% చేస్తున్న తరుణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఉచిత రేషన్, కోవిడ్‌తో మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని యోచన చేసింది. కరోనా వైరస్ బారిన పడి మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టు మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. అలాగే, కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఎక్స్ గ్రేషియా తో పాటు, ప్రతి నెల రూ. 2, 500 పిన్షన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇంట్లో సంపాదించే భర్త ను కోల్పోతే భార్యకు, భార్యను కోల్పోతే భర్తకు, వివాహం కానీ యువకులు చనిపోతే... తల్లి దండ్రులకు పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన(గతంలో తండ్రి లేక తల్లి ఉండి ప్రస్తుతం వాళ్ల ను కూడా కోల్పోతే) పిల్లలకు 25 ఏ%శీ%డ్లు వచ్చే వరకు నెలకు రూ. 2, 500 పెన్షన్ ఇస్తామన్నారు. అలాగే, ఉచిత విద్యనందిస్తామని హామి ఇచ్చారు. వీటితో పాటూ... ఢిల్లీలోని 72 లక్షల మంది రేషన్ కార్డు దారులకు ఉచితంగా 10 కిలోల రేషన్ అందిస్తామని తెలిపారు. ఇందులో కేంద్రం ఇచ్చే వాటా 5 కిలోలు, రాష్ట్ర వాటా 5 కిలోలని వివరించారు. రేషన్ కార్డు లేని వారు ఎవరైనా.. తాము పేద వాళ్లం అని, రేషన్ కావాలని కోరితే ఉచితంగా వారికి అందిస్తామని చెప్పారు.
ఇందుకోసం ఆదాయ సర్టిఫికేట్, ఇతర కార్డులు అవసరం లేదని స్పష్టం చేశారు. 'కరోనాతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారికి తిరిగి తీసుకురాలేకపోయినా... ఈ విపత్కర టైంలో వారి కుటుంబాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది. ఢిల్లీలోని రెండు కోట్ల ప్రజల ఒక కుటుంబం అన్నారు. కొందరికి ఈ స్కీం లకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని డౌట్ రావచ్చు. మా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచించే ఈ నాలుగు నిర్ణయాలను తీసుకుంది' అని చెప్పారు.
సింగపూర్ నుంచి కొత్త వైరస్ వచ్చే అవకాశం
సింగపూర్ లో కొత్త రకం వైరస్ బయటపడిందని, ఇది పిల్లలకు చాలా ప్రమాదకరమని తెలుస్తుందన్నారు. ఇది భారత్ లో మూడో దశగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సింగపూర్ నుంచి వచ్చే ఫైట్లను రద్దు చేయాలని ట్విట్టర్ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టీకాలు విషయంలో పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వరుసగా రెండో రోజు ఢిల్లీలో 5 వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా గతంతో పోల్చితే కాస్తాంత తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 4, 482 కేసులు నమోదు కాగా, 265 మరణాలు సంభవించాయి. పాజిటీవిటీ రేటు నెల రోజుల్లో అతి తక్కువగా 6.89 శాతంగా నమోదైంది. కాగా, ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 50, 863 కు తగ్గాయి. ఇందులో 31, 197 మంది హౌం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్టు అధికారులు ప్రకటించారు.