Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక కార్యకలాపాలకు దెబ్బే : ఆర్బీఐ
ముంబయి : కరోనా సంక్షోభం వల్ల దేశంలో అన్ని వస్తువులకు డిమాండ్ అమాంతం పడిపోయిందనీ.. ఇదే సమయంలో సరఫరా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ప్రథమార్థంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. అయితే గతేడాది ఇదే సమయంతో పోల్చితే అంత తీవ్రంగా లేదని పేర్కొంది. కరోనా రెండో దశ వల్ల 2021 ఏప్రిల్-మే కాలంలో ఆర్థిక వ్యవస్థ సూచీలు సన్నగిల్లుతున్నాయని 'స్టేట్ ఆఫ్ ది ఎకనామీ' రిపోర్ట్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ఉపాది తగ్గడంతో డిమాండ్ పడిపోవడంతో సరఫర దెబ్బతిన్నదని దీంతో వివిధ నిల్వలు పెరిగిపోతున్నాయని తెలిపింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 288 కంపెనీలు మెరుగైన ప్రగతిని కనబర్చాయనీ.. స్టాక్ మార్కెట్లో వీటి విలువ సగం వరకు ఉంటుందని పేర్కొంది. కరోనా వల్ల ప్రజల వైద్య వ్యయం పెరిగిందని ఎస్బీఐ గ్రూపు చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ ఇటీవల తెలిపారు. మరోవైపు ఇంధన, ఎల్పీజీ ధరలు ఎగిసిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిని నియంత్రిస్తే దేశ ప్రజల వినిమయ సామర్థ్యాన్ని పెంచొచ్చన్నారు. అధిక ధరలు ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన సూచించారు.
వినిమయం ఢమాల్
దేశంలో రెండో దశ వైరస్ విజృంభణతో ప్రజల వినిమయ శక్తి పడిపోయిందని క్వాంట్ఈకో రీసెర్చ్ ఎకనామిస్ట్ యువిక సింఘాల్ పేర్కొన్నారు. వైరస్ సంక్షోభంతో వినిమయం పడిపోయిందనీ ఆర్థిక వ్యవస్థ క్షీణించిందన్నారు. ఆర్థిక వ్యవస్థ ఈఏడాది విఆకారం వృద్థికాకుండా యూఆకారంలో రాణించే అవకాశం ఉందన్నారు. ప్రజల పొదుపు స్థాయి తగ్గిందని సింఘాల్తెలిపారు. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి ఈనెల చివరిలో కేంద్రప్రభుత్వం జీడీపీ గణంకాలను విడుదల చేయ నున్నది. ఈగణంకాలపై వైరస్, లాక్డౌన్నిబంధనల ప్రభావం ఉండనుం దన్నారు.