Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మనదేశంలో 80కోట్లమంది పేదరికంలో జీవిస్తున్నారు. వీరంతా కూడా గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకానికి అర్హులే. అయితే కేంద్రం 2011 జనాభా లెక్కల్ని పరిగనలోకి తీసుకుందనీ, ప్రస్తుత జనాభాను లెక్కలోకి తీసుకుంటే పేదల సంఖ్య 92కోట్లు దాటుతుందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రీజ్, రితికా ఖేరా, మేఘనా ముంగీకర్లు ఇటీవల ఒక నివేదిక (ఇండియా స్పెండ్, ఏప్రిల్ 2020) విడుదలచేశారు. దీనిని పరిగణలోకి తీసుకుంటే ఆహార భద్రత చట్టం కింద ఉచిత రేషన్ సరుకులు పొందే అర్హుల సంఖ్య దాదాపుగా 92.2కోట్ల మంది ఉంటారని తెలుస్తోంది.
వీరందరికీ లబ్దిచేకూరేలా ఆహార భద్రతా చట్టాన్ని అమలుజేయాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. దేశంలో ఆహార ధాన్యం నిల్వలు అపారంగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేయాలని వారు చెబుతున్నారు. ఏప్రిల్ 1, 2021నాటికి దేశంలో 564.22 లక్షల టన్నుల ఆహార నిల్వలున్నాయి. ఇందులో గోధుమలు 273.04 లక్షల టన్నులు, బియ్యం 291.18 లక్షల టన్నులున్నాయి.