Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం గత ఏడాది ఆహార కిట్ల పంపిణీ, సామాజిక వంటశాలల ఏర్పాటును అమలుజేసింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆహార కిట్‌ను ఉచితంగా అందజేసింది. లాక్డౌన్ సమయంలో 900 రూపాయలు విలువజేసే బియ్యం, పప్పులు, వంటనూనె, పొడులు...నిత్యావసర వస్తువులతో కూడిన ఆహార కిట్‌ను పంపీణీ చేశారు. పోస్ట్ లాక్డౌన్లో రూ.700విలువజేసే ఆహార కిట్‌ను, అక్టోబరు-నవంబరులో రూ.350, డిసెంబరులో రూ.450 విలువజేసే ఆహార కిట్‌ను అందజేశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులున్నాయి కాబట్టి, రూ.900విలువజేసే ఆహార కిట్లను లబ్దిదారులకు అందజేస్తున్నారు.