Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్‌లోని సౌరాష్ట్ర వద్ద తీరాన్ని తాకిన తుఫాను
- పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
- కొట్టుకుపోయిన నౌకల్లోని సిబ్బందిని రక్షించే పనిలో నేవీ
అహ్మదాబాద్ : దేశ పశ్చిమ రాష్ట్రాలపై విరుచుకుపడిన 'తౌక్టే' తుపాను బలహీనపడింది. మంగళవారం తెల్లవారుజామున గుజరాత్‌లోని సౌరాష్ట్ర రీజియన్‌లోని దియూ, ఉనా మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకింది. అనంతరం బలహీన పడి తీవ్ర తుఫానుగా మారినట్టు భారత వాతావరణశాఖ తెలిపింది. తుఫాను ధాటికి తీర ప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర తీర ప్రాంత రాష్ట్రాల్లోని పలు ప్రాం తాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం స్తంభిం చిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ డంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గాలుల ధాటికి పశ్చిమ తీర రాష్రాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అయితే తుపాను ప్రభావంతో గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా చోటుచేసుకున్న వేర్వేరు ఘటనల్లో రాష్ట్రంలో నలుగురు మతిచెందినట్టు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో సూరత్ ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. అటు ముంబ యిలోని భారీ వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతా లు జలమయ్యాయి.
గుజరాత్లో నలుగురు మృతి
తుఫాను ప్రభావంలో గుజరాత్లో జరిగిన వేర్వరు ఘటనల్లో నలుగురు మృతిచెందారు. వీటిల్లో మూడు మరణాలు మూడు జిల్లాల్లో గోడలు కూలిన ఘటనల్లో సంభవించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ కేంద్రం(ఎస్ఈఓసీ) అధికారులు తెలిపారు. రాజ్‌కోట్, వల్సాద్, భవనగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, పటాన్ పట్టణంలో పెనుగాలులు, వర్షాల ధాటికి విద్యుత్ స్తంభం విరిగి నిద్రిస్తున్న ఒక మహిళపైన పడడంతో ఆమె మరణించారు. తుపాన్ ప్రభావంతో సోమవారం అర్థరాత్రి వీచిన గాలుల ప్రభావానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి అనేక ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. గాలుల ప్రభావానికి పలుచోట్ల తాత్కాలిక నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి సమయం వరకు గుజరాత్‌లోని తీర ప్రాంత జిల్లాలైన ఘిర్సోమనాద్, ఆమ్రేలి, భవనగర్ అదేవిధంగా వల్సాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని ఎస్ఈఓసీ తెలిపింది. తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాలకు చెందిన దాదాపు 2 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
177 మందిని కాపాడిన నేవీ
తుపాను ప్రభావంతో లంగర్లు తొలగిపోవడంతో ముంబయి తీరంలో కొట్టుకుపోయిన రెండు భారీ నౌకల్లో ఉన్న 410 మంది సిబ్బందిని రక్షించడం కోసం నావీ సిబ్బంది సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయానికి కొట్టకుపోయిన రెండు నౌకల్లోని ఒక నౌక పి305లో ఉన్న 273 మందిలో 177 మందిని సుర క్షితంగా రక్షించి ఒడ్డుకు చేర్చినట్లు నేవీ అధికారులు తెలిపారు. మిగతా 96 మందిని కూడా కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నా యని పేర్కొన్నారు. యుద్ధనౌకలైన ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ కొచ్చితో పాటు హెలికాప్టర్ల ద్వారా సిబ్బందిని రక్షించేందుకు ప్రయత్ని స్తున్నారు. అయితే గాలులు తీవ్రస్థా యిలో వీస్తున్నందు వలన సహాయ కచర్యలు ఆలస్యమవుతున్నాయని, అత్యంత కఠిన సవాళ్ల నడుమ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు నేవీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
జీఏఎల్ నిర్మాణసంస్థకు చెందిన మరో నౌక సముద్రంలోని అలల ఉధృతికి మరింత దూరం కొట్టుకుపోతోందని చెప్పారు. అక్కడ కూడా సహాయకచర్యలు కొనసాగుతున్నాయన్నారు. బాంబే హై ప్రాంతంలోని హీరా చమురు క్షేత్రం వద్ద లంగర్ వేసి ఉంచిన రెండు భారీ నౌకలు సోమవారం మధ్యాహ్నం సమయంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. వీటిల్లో ఓఎన్జీసీకి చెందిన పి305 నౌకలో 273 మంది సిబ్బంది ఉండగా.. జీఏఎల్ నిర్మాణసంస్థకు చెందిన మరో నౌకలో 137 మంది ఉన్నారు. సమాచారమందుకున్న భారత నేవీ హుటాహుటిన మూడు యుద్ధ నౌకలు, ఇతర షిప్‌లను సహాయం నిమిత్తం రంగంలోకి దింపింది.