Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్ర సంక్షోభంలో వలస కార్మికులు
- ఆహార భద్రతా చట్టాన్ని అందరికీ వర్తింపజేయాలి : సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు
- గోదాముల్లో ఆహార నిల్వల్ని సద్వినియోగం చేయండి..
- కేరళ 'ఆహార కిట్ల' పథకం అనుసరణీయం
కరోనా రెండో వేవ్ ఏ స్థాయిలో ఉన్నదో పాలకులకు తెలుసు. పేదలు, వలస కార్మికులు, మధ్య తరగతి ఉపాధికి దూరమై అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సంక్షోభ సమయాన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుజేయాలని సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు. కేరళలో అందజేసినట్టు 'ఆహార కిట్లు' జాతీయ స్థాయిలో అమలుజేస్తే..కేంద్రానికి అదనంగా పడే భారం రూ.20వేల కోట్లు మాత్రమే ఉంటుందనీ, దేశ జీడీపీలో 0.09శాతం కూడా ప్రజల కోసం ఖర్చు చేయరా? అని సామాజికవేత్తలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ : సంక్షోభ సమయాన పేదల ఆకలి తీర్చే ప్రయత్నం చేయాలని ప్రతిపక్షాలు, సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు మోడీ సర్కార్‌ను కోరుతున్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వీలైనంత ఎక్కువమందిని తీసుకురావటం వల్ల కోట్లాది వలస కార్మికులకు కొంత ఊరట కలుగుతుందని వారు చెబుతున్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కొద్ది వారాల క్రితం కేరళ, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఈనేపథ్యంలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం-3 ఫేజ్ కింద మే, జూన్ రెండు నెలలపాటు ఉచితంగా 5 కేజీల ఆహార ధాన్యాలు ఇస్తామని కేంద్రం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. అయితే ఇది ఏమాత్రమూ సరిపోదని, పప్పులు, వంట నూనె ఇతర సరుకులు కూడా అందజేయాలని, పథకాన్ని 6నెలలు అమలుజేయాలని సామాజికవేత్తలు కేంద్రాన్ని కోరుతున్నారు. మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశంలోని కార్మిక సంఘాలన్నీ రేషన్ సరుకుల ఉచిత పంపిణీ పథకాన్ని ప్రస్తావించాయి. గత ఏడాది కన్నా వైరస్ సంక్షోభం ఈఏడాది తీవ్రంగా ఉన్న కారణంగా, ఆదాయ పన్ను చెల్లింపు పరిధిలోలేని కుటుంబాలందరికీ పథకాన్ని వర్తింపజేయాలని, ఆరు నెలలపాటు ప్రతినెలా రూ.7500 నగదు సాయం, 10కిలోల ఆహార ధాన్యాలు అందించాలని కేంద్రాన్ని కోరాయి. దీనిపై దేశంలోని పది కార్మిక సంఘాల సమాఖ్య కేంద్రానికి పలు సూచనలు చేస్తూ లేఖ కూడా రాశాయి.
అదనంగా అయ్యే ఖర్చు ఎంత?
కేరళ అమలుజేసిన పథకంలో రూ.700 విలువగల ఆహార కిట్‌ను జాతీ య స్థాయిలో తీసుకురావటం కష్టసాధ్యమేమీ కాదని, కేంద్రానికి అదనపు ఆర్థికభారం దేశ జీడీపీలో 0.09శాతం మాత్రమే ఉంటుందని సామాజికవే త్తలు చెబుతున్నారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి 22.5కోట్ల కుటుంబాలు వస్తాయని తెలుస్తోంది. వీరికి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని (కుటుంబంలోకి ప్రతి ఒక్కరికి ఉచితంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు పంపిణీ) రెండు నెలలపాటు అమలుజేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఇందుకోసం కేంద్రం కేటా యించిన నిధులు రూ.26వేల కోట్లు. ఈ పథకాన్ని ఆరు నెలలు అమలుజేస్తే అయ్యే వ్యయం సుమారుగా 75వేల కోట్లు ఉంటుంది. కేరళ ఆహార కిట్‌లో (రూ.700) నిత్యావసర సరుకుల్ని కేంద్రం ఇవ్వాలనుకుంటే అదనంగా మరో రూ.20వేల కోట్లు వ్యయమవుతుందని సామాజికవేత్తలు చెబుతున్నారు.