Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో కేంద్ర వ్యవసాయమంత్రిని అడ్డుకున్న అన్నదాతలు
- నల్లచట్టాలు వెనక్కితీసుకోవాలని డిమాండ్
భోపాల్ : కేంద్రప్రభుత్వం చేసిన వ్యవసాయ నల్లచట్టాలకు వ్యతిరేకంగా దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట అన్నదాతలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. వారిపై పోలీసు లాఠీలు విరుగుతూనే ఉన్నాయి. తాజాగా మధ్య ప్రదేశ్ పోలీసులు రైతులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. అనేకమంది క్షతగాత్రులయ్యారు. వారు చేసిందల్లా నల్ల చట్టాలు రద్దు చేయమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రతోమర్ను కోరడమే! దీన్ని అవమానంగా భావించిన కేంద్రమంత్రి పోలీసుల తో వారిపై దాడి చేయించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం ్ట రెండు వందల రోజులకు సమీపిస్తుంది. ఇప్పటికీ మోడీసర్కార్ అదేమొండివైఖరి అవలంబిస్తున్నది. రైతులు కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ నిరసనల హౌరును వినిపిస్తూనే ఉన్నారు. మధ్య ప్రదేశ్లోని షియోపూర్కు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, స్థానిక ఎంపీ నరేంద్రతోమర్ వచ్చారు. యునైటెడ్ కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. వాటిని తక్షణం ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు. అజాక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని పాలి రోడ్ వద్ద కేంద్ర మంత్రి కాన్వారును యునైటెడ్ కిసాన్ మోర్చా ప్రతినిధి అనిల్ సింగ్ చౌదరితో పాటు పలువురు రైతులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసన తెలిపారు. నల్లచట్టాలు వెనక్కితీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాన్వారులో ఉన్న కలెక్టర్ రాకేశ్ కుమార్ శ్రీవాస్తవ రైతుల్ని అమాంతంగా వెనక్కి నెట్టివేశారు. కలెక్టరే ఆ విధంగా రెచ్చిపోవటంతో.. పోలీసులు కేకలు వేస్తూ లాఠీలతో విరగబాదారు. ఈ ఘర్షణ మధ్యే కేంద్రమంత్రి పోలీసుల రక్షణతో బైపాస్ రోడ్డుపైనుంచి వెళ్లిపోయారు.