Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని పాలనపై 37శాతం మంది మాత్రమే సంతృప్తికరం
- గతేడాది ఇది 65 శాతం : సీఓటర్
- పీఎం పాపులారిటీ 63 శాతం తగ్గింది : యూఎస్ ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్
- కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైన ఫలితం
న్యూఢిల్లీ : దేశాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్నది. లక్షలాది కేసులు, వందలాది మరణాలు ఆందోళన కలిగి స్తున్నాయి. అయితే, సెకండ్‌వేవ్‌ను కట్టడి చేయడంలో మోడీ సర్కారు చేతులెత్తేసిందని ఆరోగ్యనిపుణులు ఇప్ప టికే అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడిలో విఫల మైన మోడీ పాలనపై ఇటు ప్రజల్లోనూ ఆదరణ క్షీణిస్తు న్నది. ఏడేండ్లలో తొలిసారిగా ఆయనకు ప్రజల్లో ఆదరణ తగ్గిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఇందులో భారత్‌కు చెందిన సీఓటర్, అమెరికా సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సంస్థలకు చెందిన నివేదికలు ఉన్నాయి. దేశంలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తున్న వేళ భారత ప్రధాని మోడీ పాపులారిటీ రేటింగ్స్ తాజా కనిష్టానికి పడిపోయాయని ఈ సంస్థల సర్వేలు వెల్లడించాయి.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చి మోడీ ప్రధాని పదవిని చేపట్టారు. 2019 ఎన్నికల్లో నూ మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని పీఠంపై మోడీ రెండో సారి కూర్చున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లను గెలుచుకున్నది. 37 శాతం ఓట్లను పొందింది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 19.5శాతం ఓట్లతో 52 సీట్లను సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇక భారతీయ సంస్థ సీఓటర్ సర్వే ప్రకారం.. 37 శాతం మంది మాత్రమే మోడీ పాలనతో '' చాలా సంతృప్తికరంగా'' ఉన్నారు. అయితే, మోడీ ప్రజాదరణ గతేడాది 65శాతంగా ఉండగా.. ఇప్పుడది దారణమైన స్థితికి చేరిందని రాయిటర్స్ వెల్లడించింది.
యునైటెడ్ స్టేట్స్ కేంద్రంగా పని చేసే ఏజెన్సీ మార్నింగ్ కన్సల్ట్ ప్రకారం.. ఈ వారం మోడీ పాపులారిటీ 63 శాతంగా మాత్రమే నమోదైంది. అలాగే, మోడీని ఆమోదించని వారు 31 శాతంగా ఉన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో మోడీ ప్రజాదరణ దారుణంగా పడిపోయింది. ఆ నెలలో ఏకంగా 22 పాయింట్లను ఆయన కోల్పోయారు. కాగా, ఈ సంస్థ మోడీ పాపులారిటీని 2019 ఆగష్టు నుంచి ట్రాక్ చేస్తోంది.
అయితే, ఈ రెండు సర్వేల ప్రకారం.. ఏడేండ్లలో ప్రధానిగా మోడీ చాలా సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు తెలిపారు. మోడీ పాలన, ఆయన ప్రభుత్వ తీరుపై సంతృప్తిని వ్యక్తం చేసినవారి కంటే అంసతృప్తిని, అయిష్టతను తెలిపినవారి సంఖ్య అధికంగా ఉన్నదని చెప్పారు. ''తన రాజకీయ జీవితంలో మోడీ అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నారు'' అని సీఓటర్ వ్యవస్థాపకులు యశ్వంత్ దేశ్‌ముఖ్ రాయిటర్స్‌కు తెలిపారు. ముఖ్యంగా, మోడీ ప్రజాదరణ పడిపోవడమనేది కరోనా సెకండ్‌వేవ్ విషయంలో జరిగిందనీ, మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని నిపుణులు చెప్పారు.