Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి కృషి
- ప్రజల ప్రాణ రక్షణ జీవనోపాధి పరిరక్షణ సర్కారు బాధ్యత
- పుచ్చలపల్లి సుందరయ్య స్మారకోపన్యాసంలో కేరళ సీఎం విజయన్
అమరావతి : కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేదిశగా కృషి జరుగుతున్నదనీ, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. సీపీఐ(ఎం) అగ్రనేత, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్థంతి సంద ర్భంగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం(ఎంబీవీకే) ఆధ్వర్యాన 'కరోనా సంక్షోభం, ప్రభుత్వాల పాత్ర' అనే అంశంపై విజయన్ ప్రసంగించారు. ఆన్లైన్లో జరిగిన సభకు ఎంబీవీకే ట్రస్ట్ ఛైర్మెన్, సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివక్షాపూరిత వ్యాక్సిన్ విధానం, మతోన్మాద రాజకీయాలు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం వంటి చర్యలకు దిగిందని కేరళ సీఎం విజయన్ వివరించారు సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య వంటి పెద్దల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేర్ సెంటర్లను నిర్వహించడం అబినóందనీ యమనీ, వారికి ఇది గొప్ప నివాళి అని అన్నారు. స్వాతంత్య్రో ద్యమంలో సుందరయ్య పాత్ర మరువలేనిదనీ, పార్లమెంటులో పేదల తరుపున పోరాడారన్నారు. కలరా, మశూచి వంటి అంటు వ్యాధులు వ్యాపించిన సమయంలో సోదరుడు రామచంద్రారెడ్డితో కలిసి ప్రజలను చైతన్యం చేయడంతోపాటు, సహాయ సహకారాలు అందించారనీ, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలందించారని తెలిపారు. ఏడాదిన్నర కాలంలో కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రపంచం నానా అవసస్థలు పడుతోందని, ఇలాంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుతూ, జీవనోపాధిని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాలకుందని తెలిపారు. కేరళలో కరోనా మొదటి రోజునుంచీ ప్రజలకు అవగాహన కల్పించి దేశంలోనే తొలిసారి లాక్డౌన్ విధించామని తెలిపారు. దీనికి ముందుగానే రూ.20 వేల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి, జీవనానికి ఇబ్బంది లేకుండా చేశామని తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఆరోగ్య వ్యవస్థను బలపరిచి జిల్లా, తాలూకా కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభించామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కుటుంబ ఆరోగ్య కేంద్రాలుగా అభివృద్ధి చేసి అన్ని వసతులతో అదనంగా 5200 బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. వైరాలజీ, మెడికల్ సైన్స్ లేబరేటరీలను బలపరచడంతోపాటు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా కరోనా మహమ్మారిని నిలువరించామని తెలిపారు. నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించడంతోపాటు సామూ హిక వంటశాలలు, హోటళ్ల ద్వారా ప్రజలకు, అతిథి కార్మికులకు భోజనాలు సరఫరా చేయడం ద్వారా ప్రజ లంతా లాక్డౌన్ చక్కగా పాటించారని వివరించారు. రెండోవేవ్ కు ముందుగానే ఆక్సిజన్ బెడ్లు, ఐసియులు, వెంటిలేటర్లు సిద్ధం చేశామని, ఆర్టిపిసిఆర్ టెస్టులు ఉచితంగా చేయడంతోపాటు నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమల్లోకి తేవడంతో ప్రజలకు మెరుగైన సేవ లు అందాయ న్నారు. తాము ప్రజలకు అవగాహన కల్పించి లాక్డౌన్ విధిస్తే కేంద్రం చెప్పాపెట్టకుండా లాక్డౌన్ విధించిప్రజలను, కూలీలను తీవ్ర ఇబ్బందులు పెట్టిందన్నారు. కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ కేంద్రం వివక్షతో వ్యవహరిస్తోందని తెలిపారు. మతోన్మాద రాజ కీయాలకు దిగిందని, కార్మిక చట్టాలు కాలరాసిందని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టాలను తేవడంతోపాటు, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతోందని తెలిపారు. ప్రజలను ఆదుకోవడం మానేసి ఆశ్రిత పెట్టు బడి దారులకు రాయితీలు కల్పిస్తోందన్నారు. ఇలాంటి సమయంలో కేరళలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం అనుసరిం చిన ప్రత్యామ్నాయ విధానాలు ప్రజలను ఆదుకున్నాయ ని వివరించారు. ఎంబీవీకే ట్రస్ట్ చైర్మెన్ పి.మధు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను జయప్రదంగా సాగించేందుకు కృషి చేయాలన్నారు. గొప్ప విప్లవకారుడు, సంఘ సంస్కరణ ఉద్యమాలకు రధసారధి, ప్రజాసేవకుడని అన్నారు. ఉత్తమ పార్లమెం టేరియన్, నిస్వార్థ ప్రజాసేవకోసం యావత్ జీవితాన్ని అంకితం చేసిన కమ్యూనిస్టు యోధులని తెలిపారు. కరో నాను కట్టడి చేయడంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైనాయ న్నారు. సుందర య్య స్ఫూర్తితో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగం గానే కరోనా ఐసోలేషన్ కేంద్రాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.