Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మారణహౌమం కొనసాగుతోంది. నిత్యం నాలుగు వేలకు పైగా ప్రాణాలను కరోనా వైరస్ బలి తీసుకుంటోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయింలో 4,529 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కోవిడ్-19 వెలుగుచూసినప్పటి నుంచి ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవేకావడం గమనార్హం. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 2,67,334 కరోనా కేసులు, 4,529 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 2,54,96,330కి చేరగా, మరణాలు 2,83,248కి పెరిగాయి. కొత్తగా 3,89,851 మంది కోలుకోవడంతో ఆ సంఖ్య 2,19,86,363కు పెరిగింది. ప్రస్తుతం. 32,26,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, దేశంలో ఇప్పటివరకు మొత్తం 18,58,09,302 మందికి కరోనా టీకాలు వేశారు. అలాగే, ఇప్పటివరకు మొత్తం 32,03,01,177 కరోనా పరీక్షలు నిర్వహించారు.
కరోనా సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించండి
దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని మానవ విపత్తుగా పరిగణించాలని 47 మంది డాక్టర్ల బృందం కోరింది. సెకండ్‌వేవ్ కరోనా ప్రళయాన్ని అధిగమించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపింది. ఈమేరకు బుధవారం సుప్రీం కోర్టు చీప్ జస్టిస్‌కు ఆ డాక్టర్ల బృందం లేఖ రాసింది. కరోనా పరిస్థితులపై రెండు పేజీల లేఖను రాసిన వారిలో డాక్టర్ కాసుల లింగారెడ్డి, డాక్టర్ ఎస్ అజిత, డాక్టర్ అన్వేష్, డాక్టర్ అవని, డాక్టర్ భక్తవత్సలరావు, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ దేశమ్, డాక్టర్ హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ జయసూర్యతోపాటు మరో 37 మంది డాక్టర్లు ఉన్నారు.