Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు
న్యూఢిల్లీ: కరోనా సోకిన వ్యక్తి సాధారణంగా మాట్లాడినా, తుమ్మినా, దగ్గినా, నవ్వినా నోటిలోంచి తుంపర్లు వెలువడుతుంటాయి. వీటిలో రెండు రకాల తుంపర్లు ఉంటాయి. పెద్ద తుంపర్లు రెండు మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. మరోకరం అతిసూక్ష్మంగా ఉంటే ఏరోసోల్స్ గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయని గురువారం కేంద్రం వెల్లడించింది. తుంపర్లు పడుతున్న ప్రాంతాన్ని చేతులతో తాకి ముఖం, నోటిని తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని తెలిపింది. అలాగే, గాలిలో 10 మీటర్ల వరకు వ్యాపించే ఏరోసోల్స్ సైతం కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. అందుకే ఇంటిలోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడూ మూసి ఉంచే గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెండు మాస్కులు ధరించడంతో మరింత ప్రయోజనం ఉంటుందంటున్నారు