Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 82 శాతం మంది మహిళల మనోగతం
బెంగళూరు : కరోనా సంక్షోభం వల్ల తమపై తీవ్రంగా పని ఒత్తిడి పెరిగిందని భారత్‌లో 82 శాతం మహిళ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా 51 శాతం మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో తమకు ఇంటి పని భారం కూడా పెరిగిందని 78 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. 'వుమెన్ ఎట్ వర్క్ : ఎ గ్లోబల్ అవుట్‌లుక్' పేరుతో డెలాయిట్ ఓ రిపోర్ట్‌ను రూపొందించింది. ఆ వివరాలు.. మానసికంగా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని 32 శాతం పేర్కొన్నారు. కాగా ఇది అంతర్జాతీయంగా 21 శాతంగా ఉంది. దేశంలో 39 శాతం మహిళలు మాత్రం తమకు తమ సంస్థ సరిపడ మద్దతును అందించిందని అభిప్రాయపడ్డారు.