Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాది ఆత్మహత్యకాదు..హత్య అంటూ సూసైడ్ నోట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్న సంస్థలో పనిచేసిన పార్థ శ్రీవాస్తవ బుధవారం ఉరి వేసుకున్నారు. 28 ఏండ్ల పార్థ్ రాసిన సూసైడ్ నోట్, సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించి స్క్రీన్ షాట్ వైరల్ అవుతున్నాయి. ఇందులో పార్త్ ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ తన సంస్థ వర్గీకరణ, రాజకీయాల గురించి ప్రస్తావించాడు. 'నా ఆత్మహత్య ఒక హత్య. దీనికి బాధ్యత వహిస్తున్న ఏకైక రాజకీయ నాయకుడు శైలజా, ఆమెకు మద్దతు ఇచ్చే పుష్పేంద్ర సింగ్ మాత్రమే. అయితే, ఈ సూసైడ్ నోట్ ఇప్పుడు పార్థ సోషల్ మీడియా ఖాతాల్లో లేదు. అయితే రెండుపేజీల నోట్‌ను ఎవరు తొలగించారు..?అన్నదానిపై సర్వత్రా చర్చ.