Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : పున్నప్ర, వాయిలార్ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు విజయన్‌తోపాటు వామపక్ష ప్రజాతంత్ర కూటమిలోని మంత్రులు ఘనంగా నివాళులర్పించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వారంతా అలప్పుజ వచ్చారు. నూతన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న ఎంబి రాజేష్, ఇతర మంత్రులు కలిసి పున్నప్ర, వాయిలార్ స్మారకానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1946లో అప్పటి ట్రావెన్కోర్ సంస్థానాదీశుడు సిసి రామస్వామి అయ్యర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో అసువులు బాసిన వారికి రెడ్ సెల్యూట్ చేశారు. ఈ ఉద్యమంలో వందలాది కమ్యూనిస్టు కార్యకర్తలు ప్రాణాలర్పించారు. కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి అధికారాన్ని చేపట్టే ముందు పున్నప్ర, వాయిలార్ స్మారకాలకు నివాళులర్పించడం.. 1957లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ పాలన నుంచి ఆనవాయితీగా వస్తోంది.