Authorization
Mon Jan 19, 2015 06:51 pm
13మందినీ నిర్దోషులుగా విడిచిపెట్టిన పాట్నా హైకోర్టు
పాట్నా : సేనారి ఊచకోత కేసులో 13మంది నిందితులను పాట్నా హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడిచిపెట్టింది. 1999 మార్చి18న సెంట్రల్ బీహార్లోని సేనారి గ్రామంలో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) అగ్రవర్ణాలైన భూమిహార్ కమ్యూనిటీపై జరిపిన దాడిలో 34మంది మరణించారు. 2016 నవంబరులో జెహనాబాద్ జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి పది మంది నిందితులకు మరణశిక్ష విధించి, మరో ముగ్గురికి యావజ్జీవం విధించారు. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 23మందిని జిల్లా కోర్టు విడిచిపెట్టింది. మరో నలుగురు నిందితులు మరణించారు. ఈ ఘటనలో తన భర్త మరణించడంతో చింతామణి దేవి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది. సాక్ష్యాధారాలు సరిగా లేవంటూ మొత్తం 13మందినీ నిర్దోషులుగా విడిచిపెట్టింది.