Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగం లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పిసి ఎల్) గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,018 కోట్ల నికర లాభాలు సాధించింది. రిఫైనరీ మార్జిన్లు, అంతకుముందు ఉన్న నిల్వలు, మారకం విలువల మద్దతుతో భారీ లాభాలను ఆర్జించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.27 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.81,680 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన త్రైమాసికంలో 11 శాతం పెరిగి రూ.84,905 కోట్లకు చేరింది. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 2020-21లో 304 శాతం వృద్థితో రూ.10,664 కోట్ల నికర లాభాలు సాధించింది.