Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) 2020-21 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 80.14 శాతం వృద్థితో రూ.6,450.75 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,580.8 కోట్ల లాభాలు ఆర్జించింది. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రతీ ఈక్విటీ షేర్‌పై 4 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. బ్యాంక్ నికర నిరర్థక ఆస్తులు 73 బేసిస్ పాయింట్లు తగ్గి 1.50 శాతంగా, స్థూల ఎన్‌పిఎలు 117 బేసిస్ పాయింట్లు తగ్గి 4.98 శాతంగా నమోదయ్యాయి.