Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ర్పొరేట్ రుణాలపై న్యాయస్థానం
న్యూఢిల్లీ : కార్పొరేట్ కంపెనీలు పొందే రుణాలకు ప్రమోటర్లు కూడా వ్యక్తిగతంగా బాధ్యులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బ్యాంక్ దివాలా చట్టం (ఐబిసి)లో కార్పొరేట్ రుణ గ్రహీతలు, ప్రమోటర్లు రుణ పరిష్కార ప్రక్రియలో బాధ్యులను చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. 2019 నవంబర్ 15న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ను న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, ఎస్ రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం సమర్థిస్తూ రుణ గ్రహీతల నుంచి వ్యక్తిగత గ్యారంటీ కోరే అధికారం విత్త సంస్థలు, బ్యాంక్‌లకు ఉందని స్పష్టం చేసింది. వ్యక్తిగత గ్యారంటీపై కేంద్ర ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించడంతో తాజాగా దీనిపై తీర్పును వెలువరించింది. పిటిషనర్లు 2019 నవంబర్ 15న ఐబిసి కింద జారీ చేసిన నోటిఫికేషన్, కార్పొరేట్ రుణగ్రహీతలకు వ్యక్తిగత హామీదారులకు సంబంధించినంతవరకు ఇతర నిబంధనలను సవాలు చేస్తూ 75 పిటిషన్లు నమోదయ్యాయి. రుణం తీసుకున్న సంస్థ, వ్యక్తి ఎగ్గొట్టిన్నట్లయితే గ్యారంటీ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.