Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గృహ నిర్బంధానికి కోల్‌కతా హైకోర్టు ఆదేశం
కోల్‌కతా : బెంగాల్లో సంచలనం సృష్టించిన నారదా స్ట్రింగ్ కేసులో కోల్‌కతా హైకోర్టు తృణమూల్ నేతలకు ఝలక్నిస్తూ... కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇటీవల అరెస్టైన బెంగాల్ నూతన మంత్రులు పర్హిద్ హకీమ్, సుబ్రతా ముఖర్జీతో పాటు ఎమ్మెల్యే మదన్ మిత్రా, టిఎంసి మాజీ నేత సౌవన్ చటర్జీలను హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించింది. వారికి తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఆర్జిత్ బెనర్జీ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించగా...తాత్కాలిక చీఫ్ జస్టిస్ రాజేష్ బిందాల్ మాత్రం హౌస్ అరెస్టుకు ఆదేశించారు. బెంచ్‌లోని ఇద్దరు జస్టిస్‌ల మధ్య విభేదాలు రావడంతో మధ్యంతర బెయిల్ కోసం పెద్ద బెంచ్‌కు సూచించింది. కాగా, ఈ హౌస్ అరెస్టు ఆర్డర్ స్టే చేయాలని టిఎంసి తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరారు.