Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజీ : 2013 నాటి అత్యాచారం కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్పాల్ను గోవా కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో తన సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై తరుణ్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 2013లో గోవా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి...అరెస్టు చేశారు. 2014 మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, గోవా క్రైమ్ బ్రాంచ్ సైతం ఆయనపై చార్జీషీటు దాఖలు చేసింది. ఐపిసిలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. ఎనిమిదేళ్ల పాటు పలు విచారణలు జరగా...శుక్రవారం ఆయనను గోవా కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. ఈ సందర్భంగా కోర్టుకు తేజ్‌పాల్ ధన్యవాదాలు తెలిపారు.